Viral Video : రెండు ముఖాలు, నాలుగు చేతులు, కాళ్లతో జన్మించిన పాప.. ఎక్కడో తెలుసా? వీడియో వైరల్

Viral Video : బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. తరాలు మారుతున్నా కొద్దీ ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటాయని. అలాంటి ఘటనలు, వింతలు, విచిత్రాలు కూడా చాలా చూశాం మనం ఇప్పటి వరకు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపీలోని సీతాపూర్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశాన్ని షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

baby born with two heads four hands and four legs video viral

ఓ మహిళ.. చాలా అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఆ పాప జన్మించింది. ఆ పాపకు రెండు ముఖాలు ఉండటంతో ఒక శరీరం బాగానే డెవలప్ అయినా, రెండో శరీరం డెవలప్ కాలేదు. దాని వల్ల.. పుట్టిన బిడ్డ కేవలం 5 గంటల్లోనే చనిపోయింది.

అయితే.. ఇలా అరుదైన బిడ్డ జన్మించిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు హాస్పిటల్ కు క్యూ కట్టారు. ఆ పాపను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కలికాలం అంటే ఇదే కాబోలు అంటూ నెటిజన్లు అరుదైన పాపను చూసి కామెంట్లు చేస్తున్నారు.

Author