Makara Rasi : గురు పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి..? అలాగే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది..? వీరు శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలను పాటించాలి…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెలలో గురు పౌర్ణమి తరువాత మకర రాశి వారికి సమస్యలు సర్దుకున్నట్టే ఉంటాయి. కానీ ప్రతిరోజు దిన దిన గండము నూరేళ్ల ఆయుష్ లాగా ఉంటుంది. ఉద్యోగులకి ఉద్యోగ మార్పు పైన ఉత్సాహం ఉంటుంది. ఇది సరిపోవట్లేదు అనే ఒత్తిడి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నం చేయండి దొరికితే తప్పనిసరిగా ఉద్యోగం చేయండి. ద్వితీయార్థంలో జీవిత భాగ్య స్వామితో క్షేత్ర దర్శనాలు చేస్తారు. ఈ జులై నెలలో మకర రాశి వారు. అలాగే చేసే పనిలో ఉత్సాహాన్ని చూపండి. మకర రాశి జాతకులు నిరుత్సాహంగా ఉండవద్దు. సంతానపరమైన లాభములు మకర రాశి జాతకులకు మాసానంతరంలో ఉంటాయి.
ఉద్యోగం లేనటువంటి వారు కూడా ఉద్యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహపరమైన యోగ్యములు చాలా చక్కగా గోచరిస్తున్నాయి. మీ నుంచి చాలా మంది లబ్ది పొందుతారు. వారికి మీరిచ్చే ఉపకారం వల్ల కొంత స్థిరం పొందుతారు. కాకపోతే వీరు తన మన భేదం కూడా చూడాలి. వీరు శత్రువులకు మంచి చేయాలి అనుకున్న వారు మాత్రం విషమే కక్కుతారు కాబట్టి ఏ ఫలితము ఆశించకుండా సహాయం చేయండి అభివృద్ధి పొందుతారు. అలాగే ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకి మంచి కాలం నడుస్తుంది. తగిన గుర్తింపు ను పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి విజయాన్ని పొందుతారు.
Makara Rasi పరిహారాలు
మకర రాశి జాతకులు ఈ జూలై మాసంలో బుధవారం పూట గణపతిని దర్శించండి. గణపతి దేవాలయానికి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే శనివారం పూట నిమ్మకాయ పులిహార లేదా చింతపండు పులిహారను నైవేద్యముగా దేవునికి పెట్టి పదిమందికి పంచి పెట్టండి. అన్నదానము చేయండి అభివృద్ధిని పొందుతారు.