Venu Swamy : ఆ ముగ్గురు గెలవడం కష్టమే… వేణు స్వామి…!

Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో వేణు స్వామి చేసే వ్యాఖ్యలు ఏ విధంగా వైరల్ అవుతాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేణు స్వామి పలువురు రాజకీయ నాయకుల జాతకాలను బయటపెడుతూ సంచలన విషయాలను తెలియజేశారు.దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల ఫలితాల్లో ఆ రాజకీయ నాయకుల పరిస్థితులను నిజంగా ప్రతిబింబిస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Venu Swamy : ఆ ముగ్గురు గెలవడం కష్టమే... వేణు స్వామి...!
Venu Swamy : ఆ ముగ్గురు గెలవడం కష్టమే… వేణు స్వామి…!

Venu Swamy : ఆ ముగ్గురు వైసీపీ నేతలు కష్టమే…

ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ముగ్గురు వైసీపీ నాయకుల యొక్క జాతకాలని బయటపెట్టారు. ఈ ముగ్గురు వైసిపి నాయకుల జాతకాలు సరిగ్గా లేవని కావున వారికి ఈసారి ఎన్నికల్లో సరైన ఫలితాలు రావడం కష్టమేనని తెలిపారు.అయితే ఎన్నికలకు ముందు పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విమర్శలు చేశారు. అలాగే రాజకీయ నాయకుల జాతకాలను బయటపెడుతూ ఈసారి ఎన్నికల్లో వారి రాక కష్టమే అంటూ తెలియజేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ…ఈసారి ఎన్నికల్లోముగ్గురు వైసీపీ నేతల జాతకాలు సరిగ్గా లేవని తెలియజేశారు. మరి ముఖ్యంగా మంత్రి రోజా గారిది అంబటి రాంబాబు గారు మరియు మినిస్టర్ అమర్నాథ్ జాతకాలు సరిగా లేవని దీని కారణంగా వచ్చే ఎన్నికల్లో వీరు గట్టి పోటీని ఎదుర్కొంటారని తెలియజేశారు…

అయితే ఈ ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారు అనేది చెప్పలేను కానీ వీరికి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హడావిడి కూడా ముగిసింది. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆత్రుత ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి వేణు స్వామి చెప్పిన జాతకాలు నిజమవుతాయా లేదా అనేది జూన్ 4న తెలుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts