Assembly Bypolls : 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ప్రారంభం

Assembly Bypolls : దేశవ్యాప్తంగా నేడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నేడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

assembly bypolls begin in 13 assembly constituencies

పశ్చిమ బెంగాల్ లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిమాచల్ ప్రదేశ్ లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరాఖండ్ లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే.. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

Assembly Bypolls : ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్

పశ్చిమ బెంగాల్ లోని రాయిగంజ్, రానాఘట్ దక్షిణ్ బాగ్దా, మనిక్తలాలో, ఉత్తరాఖండ్ లోని బధ్రీనాథ్, మంగ్లౌర్, పంజాబ్ లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా, హమిర్ పూర్, నలాగర్, బీహార్ లోని రూపాలీ, తమిళనాడులోని విక్రవండీ, మధ్యప్రదేశ్ లోని అమర్ వారాలో ఎన్నికలు జరుగుతున్నాయి.

Author