Chandrababu : తెలంగాణ, ఏపీ నాకు రెండు కళ్లు.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డ మీదే పుడతా : చంద్రబాబు

Chandrababu : ప్రపంచంలో 30 శాతం అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దాని కోసం నేను పని చేస్తా. నాకు తెలంగాణ అని, ఆంధ్రా అని కాదు. తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తా.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు.. ఈసందర్భంగా మాట్లాడుతూ తనకు తెలుగు జాతి అన్నీ ఇచ్చిందన్నారు.

Advertisement

ap cm Chandrababu speech at ntr bhavan Hyderabad

Advertisement

ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం ఇచ్చింది. తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సమైఖ్యాంధ్రప్రదేశ్ లో తొమ్మిదిన్నర ఏళ్లు ఎవ్వరూ ముఖ్యమంత్రిగా లేరు. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. మళ్లీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డ పైనే పుట్టాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చంద్రబాబు తెలిపారు.

Chandrababu : జగన్ పాలన వల్లనే ఏపీకి ఎక్కువ నష్టం

నేను ముఖ్యమంత్రిని అయినప్పుడు మొదటి సారిగా 2014 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35 శాతం వ్యత్యాసం. తెలంగాణలో ఎక్కువ ఉంది. దానికి కారణం హైదరాబాద్. నేను బాగా కష్టపడి 2014 నుంచి 2019 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించాం. మళ్లి వాళ్ల ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్లు ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు 44 శాతానికి తలసరి ఆదాయం పోయింది.

విభజన వల్ల జరిగిన నష్టం కంటే.. 5 ఏళ్ల వాళ్ల పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఏపీ ఇబ్బందుల్లో ఉంది. కానీ.. నేను ఒక్కటే చెప్పానను. ఇబ్బందులు అధిగమించి మళ్లీ ఏపీకి గట్టెక్కించే బాధ్యత నేను తీసుకుంటాను.

నన్ను ఏ కారణం లేకుండా జైలులో పెట్టాను. హైదరాబాద్ లో మీరు చూపించిన ప్రేమ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు. విప్రో సెంటర్ లో, గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే మేమే నాయకులం అని చెప్పి లక్షలాది మంది వచ్చారు. అది నా జీవితంలో నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేను చేసిన అభివృద్ధిని గుర్తు పెట్టుకొని నాకు సంఘీభావం తెలిపారు అని నేను జైలులో ఉండి చూశాను. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు వారు 53 రోజులు రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపారు. ఇది మరిచిపోలేని అనుభవం నాకు అని చంద్రబాబు అన్నారు.

అలాగే.. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని తానే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని.. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలి. రెండు రాష్ట్రాలు వేరు అయినా.. ఎవరి పాలన వారిదే. ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం, మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొంత మంది కోరుకుంటున్నారు.. వాళ్ల ధోరణి మారాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Author