Chandrababu : అధికారులకు చుక్కలు చూపిస్తా.. ఇది చంద్రబాబు 4.0 పాలన.. 1995 నాటి పాలన మళ్లీ చూపిస్తా అన్న ఏపీ సీఎం

Chandrababu : మంగళగిరి సభలో ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ 1995 నాటి పాలనను చూపిస్తా. అధికారుల తీరులో మార్పు రాకపోతే షార్ట్ ట్రీట్ మెంట్ తప్పదు. పనిలో అధికారులను పరుగులు పెట్టిస్తా. ఇది చంద్రబాబు 4.0 పాలన అని స్పష్టం చేశారు.

ap cm Chandrababu key comments in mangalagiri meeting

మొట్టమొదటి సారిగా ఫించన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారకరామారావు. ఆరోజు ఆయన ఇచ్చింది రూ.35. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటంబానికి పెద్ద వెసులుబాటు. ఆ తర్వాత 1995లో నేను రాగానే రూ.75 చేశాను. ఆ తర్వాత 2014 వరకు రూ.75 కాస్త రూ.200 మాత్రమే అయింది. నేను వచ్చిన వెంటనే రూ.200 ను వెయ్యి రూపాయలు చేశాను. మళ్లీ రూ.200 ను రూ.2000 చేశాను. తద్వారా ఇప్పుడు రూ.3 వేలు ఉన్న పింఛనును రూ.4 వేలు చేశానన్నారు.

మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు.. ఆదరించారు. రూ.2840 నేను ఇచ్చాను. ఈ పేద వాళ్లకు మీకు వచ్చే పింఛను.. నేను పెంచిన ఫించను అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పింఛను డబ్బులను పంపిణీ చేశారు. పిఠాపురంతో పాటు గొల్లప్రోలులో పించను పంపిణీ చేశారు. వాలంటీర్లు లేకున్నా పింఛను ఆగదు అని నిరూపించాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Author