Chandrababu : ప్రధాని మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. ఏపీని కేంద్రం ఆదుకుంటుందా?

Chandrababu : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు.

Andhra Pradesh cm Chandrababu meets Narendra modi and amit shah in delhi

ఈ నెల చివరి వారంలో కేంద్ర బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను కేంద్రం ప్రవేశ పెట్టింది. మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ను తీసుకురానున్న నేపథ్యంలో ఏపీ పునర్నిర్మాణానికి కావాల్సిన సాయంపై ప్రధానితో చర్చించారు.

పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణం, పలు ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్, ఇలా పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు.

ఆ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. టీడీపీ మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

Author