AP Assembly : ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. పూర్తిస్థాయి బడ్జెట్ ఉంటుందా?

AP Assembly : ఈసంవత్సరం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. అయితే.. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను గత వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే…

Advertisement

Andhra Pradesh assembly sessions from 22nd July

Advertisement

అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి గెలిచింది. టీడీపీ కూటమి నుంచి చంద్రబాబు సీఎం అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఓటాన్ బడ్జెట్ ను పక్కన పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కేంద్రంలో కూడా మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ను త్వరలో తీసుకురానుంది.

AP Assembly : ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగిస్తారా?

దాని కోసం ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగుతున్నా.. పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే పరిస్థితులు లేనట్టుగా తెలుస్తోంది. దానిపై ఆర్థిక శాఖ కూడా కసరత్తు చేస్తోంది.

గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్ప వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పట్లో పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకొచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అసలు.. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం కొత్త ప్రభుత్వానికి అందడానికి ఇంకా సమయం పడుతుంది. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగిస్తూనే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చూడాలి మరి.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

Author