Amaravati TDP Office Attack Case : ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి కేసును పోలీసులు ముమ్మరం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసుపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, అప్పిరెడ్డిని పోలీసులు గుర్తించారు.
ఈ దాడిలో మొత్తం 56 మందిని నిందితులుగా గుర్తించారు. మిగిలిన 51 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. మంగళగిరి కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులపై హత్యాయత్నం, కుట్ర సహా వివిధ కేసులను నమోదు చేశారు.
ఏపీలో టీడీపీ పార్టీకి అమరావతిలో ఉన్న ఆఫీసు కేంద్ర కార్యాలయంగా ఉంది. 2019 లో వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. విజయవాడ, మంగళగిరి, గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, నేతల అనుచరులు కేంద్ర కార్యాలయంపై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.