Allu Arjun : బన్నీ మైనపు విగ్రహంపై నోరు మెదపని చిరు, పవన్.. విబేధాలున్నాయా..?

Allu Arjun  : మెగా కాంపౌండ్ లో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టు వార్ నడుస్తోందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి ఎన్నో ఘటనలు ఉదాహరణగా నిలిచాయి. అలాంటిది ఇప్పటి వరకు ఈ విబేదాలపై ఎన్నడూ నేరుగా ఎవరూ స్పందించలేదు. కానీ సమయానుకూలంగా అవి ఎప్పటికప్పుడు బయటపడుతూనే వస్తున్నాయి. అప్పట్లో బన్నీ బర్త్ డేకు చరణ్ స్పందంచలేదు. కానీ అదే రోజు అఖిల్ బర్త్ డే అయితే మాత్రం ఘనంగా విషెస్ చెప్పాడు. అటు బన్నీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నప్పుడు కూడా ఏదో తూతూ మంత్రంగానే చరణ్ విషెస్ చెప్పాడు.

Allu Arjun : బన్నీ మైనపు విగ్రహంపై నోరు మెదపని చిరు, పవన్.. విబేధాలున్నాయా..?
Allu Arjun : బన్నీ మైనపు విగ్రహంపై నోరు మెదపని చిరు, పవన్.. విబేధాలున్నాయా..?

Allu Arjun  : వారిద్దరి తర్వాత బన్నీ..

ఇక పవన్ కల్యాణ్‌ అయితే తనకు తెలియదన్నట్టే మౌనంగా ఉండిపోయాడు. ఇలా ఎప్పటికప్పుడు మెగా వర్సెస్ అల్లు వార్ అనేది కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని నెలకొల్పారు. ఇంతకు ముందు ఈ మ్యూజియంలో ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వారిద్దరి తర్వాత ఆ ఘనతను అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. నిన్న ఆయన స్వయంగా తన చేతుల మీదుగా ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అచ్చం చూడటానికి అల్లు అర్జున్ లాగే ఉంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఘనంగా పోస్టు చేశాడు. అయితే బన్నీ ఇంత రేర్ ఫీట్ అందుకుంటే అటు మెగా కాంపౌండ్ నుంచి స్పందన మాత్రం కరువైంది. రామ్ చరణ్‌ అయితే ఈ విషయం తనకు తెలియదన్నట్టే మౌనంగా ఉండిపోయాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే చిరంజీవి కూడా తన మేనల్లుడు ఇంత ఘనత సాధించినా పట్టించుకోనట్టు మౌనంగా ఉండిపోయాడు.

Allu Arjun : బన్నీ మైనపు విగ్రహంపై నోరు మెదపని చిరు, పవన్.. విబేధాలున్నాయా..?
Allu Arjun : బన్నీ మైనపు విగ్రహంపై నోరు మెదపని చిరు, పవన్.. విబేధాలున్నాయా..?

మెగా ఫ్యామిలీలో కీలకంగా ఉండే చిరు, చరణ్‌ ఇలా మౌనంగా ఉండటంతో వీరి మధ్య విబేధాలు ఇంకా ఉన్నాయనే టాక్ నడుస్తోంది.ఇక పవన్ కల్యాణ్‌ అయితే అటు రాజకీయాలు, సినిమాలు అంటూ బిజీగా ఉంటున్నాడు. కానీ చరణ్‌ బర్త్ డే రోజు స్పెషల్ పోస్టు పెట్టిన పవన్.. బన్నీ మైనపు విగ్రహంపై మాట్లాడలేదు. అటు సాయిధరమ్ తేజ్, వరుణ్‌ తేజ్, శిరీష్‌ లు మాత్రం కొద్దో గొప్పో విషెస్ చెప్పి చేతులు దులుపుకున్నారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday