Pushpa 3 Movie : స్పైడ‌ర్ మ్యాన్ త‌ర‌హాలో పుష్ప‌3 ప్లానింగ్.. ఇక అరాచ‌క‌మే..!

Pushpa 3 Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ అయ్యాడు. పుష్ప చిత్రంతో బ‌న్నీకి నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కింది. ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప సినిమాను ముందుగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు పుష్ప 3 కూడా రానుందని తెలుస్తోంది. ‘పుష్ప’ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడు ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని మేక‌ర్స్ ప్ర‌క‌టించింది లేదు. అయితే క‌థ‌ను మ‌రింత వివ‌రంగా చెప్పాల్సి రావ‌డంతో పుష్ప‌2ని మొద‌లు పెట్టారు. ఇప్పుడు పుష్ప సీక్వెల్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.

Pushpa 3 Movie : స్పైడ‌ర్ మ్యాన్ త‌ర‌హాలో పుష్ప‌3 ప్లానింగ్.. ఇక అరాచ‌క‌మే..!
Pushpa 3 Movie : స్పైడ‌ర్ మ్యాన్ త‌ర‌హాలో పుష్ప‌3 ప్లానింగ్.. ఇక అరాచ‌క‌మే..!

Pushpa 3 Movie పుష్ప‌3 కూడా రానుంద‌

పుష్ప‌2 రిలీజ్ గురించి చ‌ర్చ న‌డుస్తున్న స‌మ‌యంలో పుష్ప‌3 కూడా రానుంద‌ని అంటున్నారు. అంతేకాదు దానికి టైటిల్‌కూడా ఫిక్స్ అయింద‌ని, ఇదే టైటిల్ కూడా ప్ర‌చారం న‌డుస్తుంది. ‘పుష్ప’ మొదటి భాగానికి ‘పుష్ప: ది రైజ్’ అని పేరు పెట్టారు. ఒక సామాన్యుడు పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా కింగ్‌పిన్‌గా మారడం మొదటి పార్ట్ లో చూపించారు. రెండో భాగానికి ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్ పెట్టి ఇందులో పుష్పరాజ్ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌ని ఎలా రూట్ చేశాడ‌నేది చూపించ‌బోతున్నారు. ఇక మూడో పార్ట్‌కి ‘పుష్ప: ది రోర్’ పేరు పెట్ట‌గా,ఇందులో అల్లు అర్జున్ మరింత రగ్‌డ్‌గా కనిపిస్తాడని అంటున్నారు.

Pushpa 3 Movie : స్పైడ‌ర్ మ్యాన్ త‌ర‌హాలో పుష్ప‌3 ప్లానింగ్.. ఇక అరాచ‌క‌మే..!
Pushpa 3 Movie : స్పైడ‌ర్ మ్యాన్ త‌ర‌హాలో పుష్ప‌3 ప్లానింగ్.. ఇక అరాచ‌క‌మే..!

బన్నీ, సుకుమార్‌లు మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై చర్చలు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, దీనితో పూర్తి క‌థని ముగిస్తార‌ట‌. అయితే థ‌ర్డ్ పార్ట్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ తరహాలో ఉంటుంద‌ని పుష్పని ఒక పవర్ ఫుల్ బ్రాండ్ గా మార్చేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారంటున్నారు. ఇందులో పాత్రల మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుందని టాక్ న‌డుస్తుంది. అయితే పుష్ప‌3కి సంబంధించిన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మూవీ ఎలా ఉంటుంది,ఇందులో ప్ర‌ధాన పాత్ర‌దారులు ఎవ‌రు అని చ‌ర్చ న‌డుస్తుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday