Andhra Pradesh : ఏపీ ఎన్నికల్లో కూటమిగా రావడంతో పాటుగా దాని గెలుపుకి ఎన్.డి.ఏ పూర్తి సహకారాన్ని అందించింది. అంతేకాదు ఎన్.డి.ఏ కేంద్రంలో బలం పెరిగేందుకు కూడా ఏపీ ప్రధానంగా మారింది. ఏపీలో కూటమి గెలిచిన 21 మంది ఎంపిల బలం ఈసారి ఎన్.డి.ఏ కు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే ఏకంగా అమిత్ షా చంద్రబాబుకి లోక్ సభ స్పీకర్ పదవిని కూడా ఇస్తామని అన్నారు. కానీ అదేమి వద్దని చెప్పిన బాబు ఏపీకి పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఇదిలాఉంటే ఎన్.డి.ఏ కి వైసీపీ కూడా సపోర్ట్ అందించడం విశేషం. లోక్ సభ స్పీకర్ సందర్భంగా వైసీపీ కూడా ఎన్.డి.ఏ తరపున వ్యక్తి అయిన ఓం బిర్లాకే తమ సపోర్ట్ అందించిందని తెలుస్తుంది. అంటే ఏపీ నుంచి ఎన్.డి.ఏ కు పూర్తిస్థాయి మద్ధతు లభించింది. కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసినా సరే వైసీపీకి కేంద్రంలో ఎన్.డి.ఏ కి సపోర్ట్ చేయక తప్పలేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది అదే కాబట్టి దాన్ని కాదనలేని పరిస్థితి.
Andhra Pradesh ఏపీ కి ఎన్.డి.ఏ రిటర్న్ గిఫ్ట్
ఏపీ లో కూటమి గెలిచిన 21 ఎంపిలు.. వైసీపీ గెలిచిన 4 ఎంపిలు అంతా కూడా ఎన్.డి.ఏ కి సపోర్ట్ అందించారు. ఏపీలో అన్ని సీట్లు ఎన్.డి.ఏ తో చేతులు కలపడం రాజకీయ పరంగా కొత్త సమీకరణాలను సూచిస్తుంది. ఐతే ఇక్కడ ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి ఏపీకి కేంద్రం నుంచి కావాల్సిన సహకారాన్ని అన్నివిధాలుగా వాడుకోవాలని చూస్తున్నారు. కచ్చితంగా చంద్రబాబు మార్క్ పాలన ఇప్పుడు కేంద్ర ఫుల్ సపోర్ట్ తో ఆంధ్రా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంటుంది. ఏపీ ఇచ్చిన బలానికి ఎన్.డి.ఏ తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని బలంగా నమ్ముతునారు ఆంధ్రా ప్రజలు.