T20 World Cup 2024 : వెక్కి వెక్కి ఏడ్చిన టీ ఇండియా ఆట‌గాళ్లు.. వాళ్లు ఏడ్చి అభిమానులను ఏడిపించారు..!

T20 world cup 2024  : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా సౌతాఫ్రికా మీద విజేతగా నిలిచింది. వెస్టిండీస్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ తమ సత్తా చాటారు. ఫలితంగా 7 పరుగుల తేడా తో గెలిచి ప్రపంచ కప్ ని ముదాడారు. ముఖ్యంగా చివరి 3 ఓవర్లలో బుమ్రా, అర్ష్ దీప్, హార్ధిక్ పాండ్యా చేసిన కట్టడికి సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులు ఎత్తేశారు.చివరి ఓవర్ హార్ధిక పాండ్యా 6 బంతులకు 16 చేయాల్సిన సాతాఫ్రికాను రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. టఫ్ టైం లో బౌలింగ్ అది కూడా జట్టుకి 13 ఏళ్ల నుంచి కలగా మారిన వరల్డ్ కప్ ని అందించేందుకు హార్ధిక్ పాండ్యా అజేయమైన కృషి చేశాడు. జట్టు విజయానంతరం టీం ఇండియా కెప్టెన్ రోహిత్, విరాట్ కొహ్లి, హార్ధిక్ పాండ్య, సిరాజ్ ఇలా అందరు ఎమోషనల్ అయ్యారు.

T20 world cup 2024 : వెక్కి వెక్కి ఏడ్చిన టీ ఇండియా ఆట‌గాళ్లు.. వాళ్లు ఏడ్చి అభిమానులను ఏడిపించారు..!
T20 world cup 2024 : వెక్కి వెక్కి ఏడ్చిన టీ ఇండియా ఆట‌గాళ్లు.. వాళ్లు ఏడ్చి అభిమానులను ఏడిపించారు..!

ఇవి కన్నీళ్లు కాదు గుండెనిండి వస్తున్న ఆనంద భాష్పాలుగా అభిమానులు తెలుసుకునేలా చేశారు. టఫ్ టైం లో బౌలింగ్ వేసి జట్టుకి విజయాన్ని అందించిన హార్ధిక్ పాండ్యా ఐతే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. అతనికి తోడుగా సిరాజ్ కూడా ఏడుస్తూనే ఛానెల్ తో మాట్లాడాడు. 2007 వరల్డ్ కప్ మొదలైన ఏడాది జట్టు టైటిల్ గెలిచింది ఆ తర్వాత 17 ఏళ్లుగా వరల్డ్ కప్ గెలవలేదు.

T20 world cup 2024  చిన్నపిల్లలా ఏడ్చిన టీం ఇండియా ప్లేయర్స్

ఇక 2011 తర్వాత వరల్డ్ కప్ అందని ద్రాక్షగానే ఉంది. అందుకే వరల్డ్ కప్ కొట్టేశాం అన్న ఆనందంలో టీం ఇండియా ప్లేయర్స్ అంతా కూడా ఎమోషనల్ అయిపోయి గ్రౌండ్ లో చిన్న పిల్లల్లా ఏడ్చేశారు. వాళ్లే కాదు దేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలను కూడా ఏడిపించేశారు. ఐతే ఈ విజయానందంలో టీ20 లకు విరాట్ కొహ్లి, రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడం క్రికెట్ అభిమానులను షాక్ అయ్యేలా చేసింది. కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసమే ఈ రిటైర్ మెంట్ అంటూ కొహ్లి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Author