Siddharth : రేవంత్ రెడ్డి గారు నా సపోర్ట్ మీకే.. మీ వెంటే నేను.. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న సిద్ధార్థ్

Siddharth : భారతీయుడు 2 సినిమాలో నేను జీరో టాలరెన్స్ గురించి మాట్లాడాను. అవినీతి, డ్రగ్స్ కు వ్యతిరేకంగానే ఈ సినిమా ఉంటుంది. అలాంటి భారతీయుడు 2 మూవీ ప్రెస్ మీట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెబుతున్నప్పుడు నా మాటలను కొందరు మిస్ అండర్ స్టాండ్ చేసుకున్నారు. దాన్ని నేను వెంటనే క్లియర్ చేయాలి. నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.. అని హీరో సిద్ధార్థ్ స్పష్టం చేశారు.

actor Siddharth clarifies about his words on revanth reddy

పిల్లల భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే కాకుండా, మన చేతుల్లోనూ ఉంటుంది. వాళ్ల భవిష్యత్తును కాపాడుకునే కర్తవ్యం మన మీద ఉంది. నేను వంద శాతం ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతున్నా. ఆయన ప్రభుత్వానికి కూడా నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది.. అని సిద్ధార్థ్ అన్నారు.

Siddharth : నేను చాలాసార్లు సామాజిక బాధ్యతను చాటాను

నేను ఇప్పుడే కాదు.. ఇది వరకు కూడా సామాజిక బాధ్యతగా నా వంతు బాధ్యతను నిర్వర్తించానని చెప్పుకొచ్చారు. చాలాసార్లు సామాజిక బాధ్యతలో నేను పార్టిసిపేట్ చేశాను. ఎప్పటికీ నా మద్దతు ఉంటుంది.. అని ఇన్ స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు సిద్ధార్థ్.

 

View this post on Instagram

 

A post shared by Siddharth (@worldofsiddharth)

Author