IPS Transfer in Telangana : తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్ ను నియమించారు. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్ పంకజ్ నియమితులయ్యారు. ములుగు ఓఎస్‌డీగా మహేష్ బాబా సాహెబ్ నియమితులయ్యారు.
ఇక.. గవర్నర్ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ నియమితులయ్యారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్లు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ప్రభుత్వ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా రాచకొండ సీపీగా ఉన్న సుధీర్ బాబును కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆ తర్వాత రామగుండం సీపీగా ఎం. శ్రీనివాసులు, సైబరాబాద్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్ నియమితులయ్యారు. రాచకొండ కొత్త సీపీగా తరుణ్ జోషిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత మళ్లీ తాజాగా 8 మంది ఐపీఎస్ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది.