Diabetic Patients : డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగిన… కొబ్బరి తిన్న… ఏం జరుగుతుంది…!

Diabetic Patients : కొబ్బరి నీళ్లు తాగటం అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే. ఇది సహజమైన పానీయం కాబట్టి. టెట్రాప్యాక్ లు లేక సీసాలో ప్యాక్ చేసిన జ్యూస్ లు మరియు శీతల పానీయాల కంటే కూడా ఇది చాలా మంచిది. గ్రామాలతో పాటుగా నగరాల్లో కూడా దీనిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఇవి మాత్రమే కాకుండా సముద్ర తీరానికి, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ఈ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. లేత లేక ముదురు కొబ్బరి నీళ్లు మనల్ని హైడ్రేట్ చేసి వెంటనే శక్తిని ఇవ్వటంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే మధుమేహం ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగొచ్చా.లేదా. అనే సందేహాలు తరచుగా తలెత్తుతాయి. ఈ కొబ్బరి నీళ్లలో సహజమైన చక్కర అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం తీయగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు దీనిని తాగటానికి ఎక్కువగా భయపడతారు. అయితే షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ఏమవుతుంది. మంచిదా. కాదా. అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement
Diabetic Patients : డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగిన... కొబ్బరి తిన్న... ఏం జరుగుతుంది...!
Diabetic Patients : డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగిన… కొబ్బరి తిన్న… ఏం జరుగుతుంది…!

డైటీషియన్ల ప్రకారం. పాలకంటే కూడా కొబ్బరి నీళ్లలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనిలో కొవ్వు పరిమాణం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతిరోజు దీనిని తీసుకునే వ్యక్తులు వారి శరీరంలో పొటాషియం, మెగ్నీషియం,సోడియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పొందుతారు. లేత కొబ్బరి నీళ్లను తీసుకోవటం వలన శరీరం నుండి టాక్సిన్లు అనేవి తొలగిపోతాయి. ఇది ఎన్నో సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ సహజ పానీయాన్ని ప్రతిరోజు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు. ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన ఇది రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. లేత కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరంలో నీటిలో లోపం అనేది తొలగిపోయి అద్భుతమైన శక్తిని కూడా ఇస్తుంది.

Advertisement

డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరి నీళ్లతో పాటు అందులో ఉన్నటువంటి కొబ్బరిని కూడా తినవచ్చు. ఎందుకు అంటే. ఇందులో మెటబాలిజం మెరుగుపరచటంలో సహాయ పడే ఎన్నో పోషకాలు అధికంగా ఉన్నాయి. అంతే కొబ్బరి క్రీమ్ తీసుకోవడం వలన కూడా శరీర కొవ్వు అనేది తగ్గుతుంది. అందుకే కొబ్బరి క్రీమ్ ను రెగ్యులర్ డైట్ లో తీసుకోవటం మంచిది. దీనిలో ఉన్నా మంచి కొలెస్ట్రాల్ గుండె సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది…

Author