Zodiac Signs : జులై నెల 5 ,6 ,7 తేదీలలో రవి చంద్రులు కలవడం వలన అమావాస్య ఏర్పడనుంది. అయితే చాలా మంది అమావాస్య అనగానే అవయోగాలు ఏర్పడతాయని నష్టాలే జరుగుతాయని భావిస్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు శుభకార్యాలు చేయకపోవడం ప్రయాణాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే రవి చంద్రులు రెండు కూడా రాజా గ్రహాలే కావడం వలన అమావాస్య రోజు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉపయోగాలు కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి..? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Zodiac Signs : మేష రాశి…
మేష రాశి కి తృతీయ స్థానంలో రవి చంద్రుడు కలవడం వలన ఏ పని చేసిన అది సఫలం అవుతూ ఉంటుంది. అలాగే ఈ రాశికి వృద్ధి స్థానం అయినందు వల్ల ఉద్యోగులుకు పురోగతి లభిస్తుంది. మరియు ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇక నిరుద్యోగులు మంచి అవకాశాలను పొందుతారు. ఈ రాశి వారికి తోబుట్టులతో బంధుమిత్రులతో విభేదాలు పరిష్కారం అవుతాయి.
Zodiac Signs : వృషభం
వృషభ రాశి వారికి ధన స్థానంలో అమావాస్య ఏర్పడింది. దీనితో అధిక ధన వృద్ధి లభిస్తుంది. అలాగే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆదాయం అనేక మార్గాలలో వస్తుంది. అలాగే ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు రాబడి అంచనాలు పెరుగుతాయి. వీరి సలహాలు సూచనల ద్వారా పై అధికారులు ప్రయోజనం పొందుతారు.
Zodiac Signs సింహరాశి.
సింహా రాశి వారికి లాభ స్థానంలో రవి చంద్రుల కలయిక ఏర్పడడం వలన రాజయోగాన్ని కలిగి ఉంటారు. అలాగే ఉద్యోగంలో ప్రాధాన్యం హోదా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. అలాగే ఈ రాశి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి బయటపడతారు.
Zodiac Signs : కన్య రాశి
ఈ రాశి వారికి దశమ స్థానంలో అమావాస్య ఏర్పడడం వలన ఉద్యోగంలో సానుకూల మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుతాయి. అలాగే ఉద్యోగంలో సిరత్వం ఏర్పడుతుంది. దీనివల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రత్యర్ధులు మరియు పోటీ దారుల మీద విజయాన్ని సాధిస్తారు. కన్య రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి . రాజకీయ ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మకర రాశి.
మకర రాశి వారికి 6వ స్థానంలో రాజా గ్రహాల కలయిక జరిగినందున రోగ రుణ శత్రుల సమస్యల నుంచి బయటపడతారు. వీరికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి లాభాలు అందుతాయి. ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఇష్టమైన సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు వివిధ సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల నష్టం నుంచి బయటపడే దిశగా అడుగులు వేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
కుంభరాశి.
కుంభరాశి వారికి పంచమ స్థానంలో రవి చంద్రుడు కలయిక వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులలో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.అలాగే వృత్తి వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. విదేశాల నుంచి శుభవార్తలను వింటారు. ఈ రాశి వారి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.