Birth : లోకంలో ప్రతి జీవి పుట్టుకకు ముందే ఈ ఆరు విషయాలు నిర్ణయించబడతాయి…!

Birth : ఈ భూమి మీద జన్మించే ప్రతి మనిషి తలరాత అనేది అతని పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి ముందే లిఖించబడి ఉంటుంది. విధి రాతను ఎవరు మార్చలేరు. ఒక వ్యక్తి గర్భంలోకి ప్రవేశించటం దగ్గర నుండి అతను మరణించే వరకు ప్రతి దాని వెనుక కర్మ ఫలం అనేది కచ్చితంగా ఉంటుంది. గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలాన్ని అదే జన్మలో అనుభవించేగా, మిగిలిన కర్మ ఫలాన్ని ఆ జీవుడు మరో జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అది పాపమైన కావచ్చు, పుణ్యమైనా కావచ్చు. ఆ కర్మ ఫలం ఆధారంగానే విధి రాత అనేది రాయబడి ఉంటుంది. మనిషి జన్మించక ముందే ఈ ఆరు విషయాలు ముందే నిర్ణయించబడతాయి. వీటిని భూమి మీదకు వచ్చాక మార్చుకోవటం అనేది కుదరని పని. మరి ఆ ఆరు విషయాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Birth : లోకంలో ప్రతి జీవి పుట్టుకకు ముందే ఈ ఆరు విషయాలు నిర్ణయించబడతాయి...!
Birth : లోకంలో ప్రతి జీవి పుట్టుకకు ముందే ఈ ఆరు విషయాలు నిర్ణయించబడతాయి…!

Birth  పుట్టుక

మానవుని జన్మ ఎక్కడ ఏ విధంగా జరగాలి. ఎవరి కడుపున ఎలా పుట్టాలి అనేది గర్భంలోకి ప్రవేశించక ముందే నిర్ణయించబడి ఉంటుంది. అతడు గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా ఈ జన్మలో ఎక్కడ. ఎవరికి. ఏ ఇంట్లో పుట్టాలి అనేది విధాత నిర్ణయిస్తాడు. దీనిని ఎవరు మార్చలేరు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే. కొంతమంది ధనవంతుల ఇంట్లో వారి పిల్లలు బుద్ధి విహీనంతోను, అంగవైకల్యంతోను పుడుతూ ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నఏది వారు అనుభవించలేరు. వారు పూర్వ జన్మలో చేసిన పాపపు కర్మల ఆధారంగా ఈ జన్మలో ఇలా జన్మించవలసి వచ్చింది. అదే కర్మఫలం అంటే. దీనిని ఎవరూ మార్చలేరు. ఇక రెండవది.

అతడు ఎంత బుద్ధిమంతుడు, జ్ఞానంతో ఉండాలి అనేది ముందు గానే లిఖించబడి ఉంటుంది. ఒక గురువు తన శిష్యుల అందరికీ ఒకే విధంగానే జ్ఞానాన్ని పంచుతాడు. వారిలో ఒకరు మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదిస్తే, మరొకడు మాత్రం మందమతి గానే ఉంటూ చెడు సావాసాలకు అలవాటు పడి అందరి చేత చేదరించుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, జ్ఞానం అనేది అతను గత జన్మలో చేసిన కర్మ ఫలాల ఆధారంగా నే నిర్ణయించబడి ఉంటాయి. ఇక మూడవది. మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి అనేది కూడా ఆ విధాత ముందే నిర్ణయిస్తారు. అతని తలరాత ఆధారంగానే ఎటువంటి జీవిత భాగస్వామి అతని జీవితంలోకి రావాలో ముందే గానే ఫిక్స్ చేసి ఉంటుంది. దీనిని కూడా ఎవరు తప్పించలేరు.

నాల్గవది. అతని దగ్గర ఎంత ధనం ఉండాలి. ఆ వ్యక్తి ధనవంతుడిగా ఉండాలా, పేదవాడిగా ఉండాలా అనేది అతడు పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలాల ఆధారంగా నే నిర్ణయించబడి ఉంటుంది. కొంతమందికి ఎంత కష్టపడినా, ఎన్ని వ్యాపారాలు చేసిన కలిసి రాదు. మరి ఇంకొంత మందికి ఏది చేసినా ఇట్టే కలిసొస్తూ ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. అలాగని కొందరు ఉన్నట్టుండి ఏదో ఒక విధంగా కలిసి వచ్చి ఒక్కసారిగా ధనవంతులు అవుతారు.

మరి కొందరు మాత్రం ఎప్పటికీ పేదవారి గానే మిగిలిపోతూ ఉంటారు. ఇదంతా కర్మఫలం అనుసరించే జరుగుతూ ఉంటుంది. ఇక ఐదవది. మానవుడు మరణం అనేది ఎప్పుడూ ఎలా ఏ విధంగా సంభవిస్తుంది అనే విషయం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. అతను రోగాల బారిన పడి బాధపడుతు మరణించాలా లేక హాయిగా సహజ మరణం పొందాలా లేక ప్రమాదం బారిన పడి మృత్యు ఒడిలోకి చేరాలా అనేది ఆ వ్యక్తి గత జన్మలో చేసిన కర్మలను బట్టి నిర్ణయించబడి ఉంటుంది…

Author