Sunflower : సన్ ఫ్లవర్ ఆయిల్ జుట్టుకు వాడితే ఏం జరుగుతుందో తెలుసా…!

Sunflower : ప్రస్తుత కాలంలో చాలా మందికి జుట్టు రాలటం ఒక సమస్యగా మారింది.అయితే జుట్టు పెరగడానికి చాలామంది కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనిని వాడటం వల్ల జుట్టుకి చాలా మంచిది. అయితే సన్ ఫ్లవర్ ఆయిల్ ను కూడా జుట్టుకి వాడొచ్చు అని నిపుణులు అంటున్నారు. దీనిని జుట్టుకి రాసినట్లయితే జుట్టు సమస్యలు ఎన్నో వస్తాయి అని అంటున్నారు. అయితే ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ సీడ్స్ ఎంతో ఫేమస్. దీనిని స్నాక్స్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. దీనిలో ఐరన్ మరియు ఒలేయిక్ మరియు లెనోలిక్ విటమిన్ ఇ లాంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు దీనిలో ఉన్నాయి. పొద్దు తిరుగుడు నూనెను, పొద్దు తిరుగుడు గింజల నుండి కూడా తయారు చేయడం జరుగుతుంది. దీనిని జుట్టు కి వాడడం వలన ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.

Advertisement
Sunflower : సన్ ఫ్లవర్ ఆయిల్ జుట్టుకు వాడితే ఏం జరుగుతుందో తెలుసా...!
Sunflower : సన్ ఫ్లవర్ ఆయిల్ జుట్టుకు వాడితే ఏం జరుగుతుందో తెలుసా…!

Sunflower కోల్డ్ ప్రెస్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్

హోల్డ్ ప్రెస్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు వేడిని అసలు ఉపయోగించకుండా తయారు చేస్తారు. దీని వలన స్వచ్ఛమైన లక్షణాలు అనేవి దీనిలో ఉంటాయి. అదే ప్రాసెస్డ్ చేసి తయారు చేసినట్లైతే గొప్ప గుణాలు అనేవి కోల్పోతాయి.అప్పుడు దీనిని అప్లై చేస్తే ఎలాంటి లాభాలు ఉండవు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కనుక వాడితే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం…

Advertisement

మృదువుగా : కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తో తయారైనటువంటి సన్ ఫ్లవర్ ఆయిల్ ను జుట్టు కు ఉపయోగించటం వలన జుట్టు రాలటం తొందరగా తగ్గుతుంది. అలాగే ఈ నూనె పొడి జుట్టును మృదువుగా మారుస్తుంది. అలాగే జుట్టు చిట్లటం కూడా తగ్గుతుంది. జుట్టును మృదువుగా మరియు హైడ్రేడ్ గా కూడా ఉంచుతుంది…

చుండ్రు : తలలో చుండ్రు ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా తయారవుతుంది. దీనిని తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు అధికంగా సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు సన్ ఫ్లవర్ ఆయిల్ ఉన్న ప్రోడక్ట్ ను ఉపయోగించవచ్చు. దీని వలన దురద కూడా తొందరగా నయం అవుతుంది. దీనికోసం జుట్టుకి నూనె రాసి మసాజ్ చేయాలి. దాని తర్వాత ఓ టవల్ ను వేడి నీటిలో ముంచి పిండి జుట్టుకు కట్టుకొని కనీసం 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దాని తర్వాత షాంపూతో క్లీన్ చేసుకోవాలి. దీని వలన చుండ్రు మరియు పోలుసులు, దురద లాంటివి తొందరగా తగ్గుతాయి…

ఎలా వాడాలి : ఈ ఆయిల్ ను వాడితే జుట్టు అనేది ఎంతో కాంతివంతంగా మేరుస్తుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. పొడి జుట్టును తగ్గించే స్మూతింగ్ సిరమ్ కూడా పనిచేస్తుంది. దీనిని సిరంల కూడా తీసుకోవచ్చు. దీనికోసం రెండు చుక్కల నూనెను తీసుకొని పోడి జుట్టుపై రాయాలి. దీనితో జుట్టు మృదువుగా తయారవుతుంది. అలాగే మీరు ప్రతిరోజు వాడే కండిషనర్ లో కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుకొని జుట్టుకి అప్లై చేసుకోండి. దీనితో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

సైడ్ ఎఫెక్ట్స్ : ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ కొన్ని చర్మ తత్వాలకి కూడా పడదు. అలాంటి టైమ్ లో అప్లై చేసే ముందు చేతిపై కాస్త నూనె కూడా రాసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ లాంటివి చేయాలి. జుట్టు కు నూనె రాసిన తర్వాత అధికంగా వేడి ఉన్నట్లయితే ప్రోడక్ట్ ని వాడటం మానేయండి. దీంతో హెయిర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

Author