Belly Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే… సింపుల్గా ఈ చిట్కాలు పాటిస్తే చాలు…!

Belly Fat : ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్ల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యల్లో అధిక బరువు మరియు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఈ సమస్యల కారణంగా ఎంతోమంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బరువు తగ్గటానికి మరియు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించడానికి చాలా కష్టపడి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని మూలికలు బరువు తగ్గటానికి ఎంతో సహాయం చేస్తాయి. బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును కరిగించటానికి మీకు సహాయ పడేందుకు కొన్ని సాధారణ చిట్కాలు బరువు తగ్గటానికి కూడా బెస్ట్ నివారణలుగా పని చేస్తాయి. ఇప్పుడు ఆ మూలికలు ఏంటో మనం తెలుసుకుందాం..

Belly Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే... సింపుల్గా ఈ చిట్కాలు పాటిస్తే చాలు...!
Belly Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే… సింపుల్గా ఈ చిట్కాలు పాటిస్తే చాలు…!

వెల్లుల్లి లాంటి సహజ వంటగది మూలిక వివిధ ఆహార రుచిని మరియు సువాసనను మెరుగుపరిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, మంగనీస్ మరియు ఇతర విటమిన్స్, మినరల్స్, బెల్లీ ఫ్యాట్ బర్న్ చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క మరియు తేనే టీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి దీనిని పోషక ఆహారంగా చేస్తాయి. సాధారణ వ్యాయమంతో పాటుగా దాల్చిన చెక్క మరియు తేనె టీ తీసుకోవటం వలన శరీరంపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాలు అనేవి ఉంటాయి. రోజు ఉదయం నిమ్మరసం తీసుకోవడం వలన కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో టాక్సీన్స్ పేరుకుపోకుండా కూడా రక్షిస్తుంది. తేనె ఒక సహజ స్వీటేనర్,దాని రుచిని మెరుగుపరిచేందుకు కూడా నిమ్మకాయ నీటిలో చేర్చుకోవచ్చు..

పెరుగును కూడా మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మీ శరీరంలోని పొట్ట కొవ్వును కరిగించి జీవక్రియ పెరిగేలా చేస్తుంది. యోగార్ట్, ప్రోబయోటిక్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్, మినరల్స్ అనేవి అద్భుతమైన మూలం. ఇది గట్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,పొటాషియం, ఎన్నో శరీరం సరిగ్గా పని చేసేందుకు అవసరమైన ముఖ్యమైన అంశాలకు ఈ చియా గింజలు మంచి మూలం. ఈ విత్తనాలు మీరు తక్కువ తిన్నా కూడా కడుపు నిండుగా ఉచ్చటం వలన ఆరోగ్యమైన బరువును నిర్వహించేందుకు మీకు ఎంతో మేలు చేస్తుంది..

Author