8 Shape Walking : ఈ 8 ఆకారంలో నడవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే… తప్పక ఆశ్చర్యపోతారు…!

8 Shape Walking : ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యం కోసం ఉదయాన్నే నడవడం అలవాటు మార్చుకుంటున్నారు. అయితే నడవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ప్రజలు తమకు ఇష్టం వచ్చినప్పుడు ఉదయం లేక సాయంత్రం నడుస్తూ ఉంటారు. ఇలా నడవడం వలన చర్మం కాంతివంతంగా మెరవడంతో పాటు సులభంగా బరువు ను కూడా నియంత్రించవచ్చు. ఇలాఎంతో మంది బరువు తగ్గేందుకు నడవడాన్ని ఎంచుకుంటారు. ఇలా నడవడం వల్ల కూడా ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు నడవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇలా నడిస్తే ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు వైద్యులు. అదే ఈ 8 సంఖ్య ఆకారంలో నడిచినట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. దీనిని ఇన్ఫినిటీ వాక్ అని కూడా పిలుస్తారు. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

8 Shape Walking : ఈ 8 ఆకారంలో నడవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే... తప్పక ఆశ్చర్యపోతారు...!
8 Shape Walking : ఈ 8 ఆకారంలో నడవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే… తప్పక ఆశ్చర్యపోతారు…!

బరువు తగ్గడం : ఈ 8 సంఖ్య ఆకారంలో ఉండటం వలన తొందరగా బరువును నియంత్రించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆకారంలో నడవడం వలన శరీర భాగాలు మరియు కండరాలు అన్నీ కూడా కదులుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుంది. ఇలా చేయటం వలన తక్కువ టైంలో వేగంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది…

8 Shape Walking బీపీ నియంత్రణ

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ ఆకారంలో నడవటం వల్లరక్త పోటును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంతేకాక ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ఆకృతిలో నడవడం వలన గుండెపై భారాన్ని కూడా నియంత్రించవచ్చు.అలాగే ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల బీపీ అనేది కంట్రోల్ లో ఉంటుంది…

కండరాలు ఎక్కువగా కదులుతాయి : నిండుగా ఉన్న కడుపుతో నడవడం కన్నా ఈ ఫిగర్ ఎనిమిది ఆకారంలో నడవటం వలన కండరాలు అనేవి అధికంగా పనిచేస్తాయి. అలాగే వెనకకు ముందుకు వంగడం వలన పొట్ట వద్ద ఉన్న కండరాలు మరియు తొడల కండరాలు కూడా ఎంతో బలపడతాయి. ఇలా చేయడం వలన ఎటువంటి దెబ్బలను అయినా తట్టుకోగల శక్తి ఉంటుంది. అంతేకాక ఫిట్నెస్ పెంచడంతో పాటుగా కొవ్వును కూడా కరిగిస్తుంది…

శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది : 8 ఆకారంలో నడవటం వలన ఆ వ్యక్తి యొక్క ఆనందాన్ని పెంచుతుంది. అంతేకాక టర్న్ తీసుకునేటప్పుడు బాడీ బ్యాలెన్స్ అనేది అదుపు తప్పి కిందపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఇలా చేయటం వలన శరీర సమన్వయం అనేది ఎంతగానో పెరుగుతుంది. అలాగే ఒత్తిడి మరియు ఆందోళన నుండి కూడా దూరం చేస్తుంది…

Author