Monsoon : వర్షాకాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి… చేస్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే…!

Monsoon : వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు రోగాలు వస్తాయి. అందుకే దీనిని రోగాల కాలం అని కూడా చెబుతారు. వర్షాకాలం అనేది చూడడానికి ఉండడానికి హాయిగా ఉన్న ఈ సీజన్ ఎక్కువగా రోగాలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ కాలంలో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. అందుకనే ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. లేకపోతే జీర్ణ క్రియ వంటి సమస్యలు వస్తాయి. కలుషితమైన నీరు ఆహారం వంటివి తీసుకోవడం వలన అజీర్తి డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని నిపుణులు చెబుతున్నారు.

Monsoon : వర్షాకాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి... చేస్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే...!
Monsoon : వర్షాకాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి… చేస్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే…!

అయితే ఈ సీజన్ లో బయట ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది. ఇంట్లో పరిశుభ్రంగా తయారు చేసిన ఆహారాలను తీసుకోవాలి. బయట నుండి తీసుకువచ్చిన కూరగాయలు పండ్లను ఉప్పునీటిలో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. లేకపోతే మీరు అనారోగ్య బారినపడే అవకాశాలు ఉంటాయి. అలాగే పాల ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వాటిపై ఎక్స్ పైరీ డేట్ ని తప్పకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఫ్రిజ్లో ఎక్కువ కాలం నిల్వచేసిన ఆహారాలను అసలు తీసుకోకూడదు. ఒకవేళ అవి తిన్నట్లయితే విరోచనాలు వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి ఆహారాలను తీసుకోవాలి.

ముఖ్యంగా ఎలాంటి ఆహార పదార్థాలు అయినా కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని మాత్రమే తీసుకోవాలి. వంట చేసేటప్పుడు కూడా చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతనే వంట చేయాలి. బయటికి వెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ పట్టుకోకూడదు. ఈ సమయంలో బయట నీటిని కూడా తాగకపోవడం మంచిది. అలాగే ఇంట్లోకి సూక్ష్మ క్రిములు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.

Author