Juice : గత కొన్ని సంవత్సరాలుగా ప్యాకేజ్ జ్యూస్ త్రాగె ట్రెండ్ అనేది భారతదేశం లో బాగా పెరిగింది. మార్కెట్ లో ఎన్నో రకాల బ్రాండ్ ల పండ్ల రసాలను విక్రయిస్తున్నారు. ప్రజల ఎంతో ఉత్సాహంతో వీటిని కొనుక్కొని మరీ తాగుతున్నారు. అయితే ఇప్పుడు క్వాన్డ్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది కాదు అని ICMR స్పష్టం చేసింది. క్వాన్డ్ జ్యూస్ లలో పండ్ల రసాలు కాక కృత్రిమ రుచులను కలుపుతున్నారు. దీనివలన అవి పండ్ల రసాన్ని కలిగి ఉండడం లేదు. అయితే అవి చాలా చక్కెరను కలిగి ఉండవచ్చు అని ICMR తెలిపింది. ప్యాక్ చేసేటువంటి జ్యూస్ లు సులభంగా దొరుకుతాయి. ప్రజలు వాటిని దుకాణాల నుండి కొంటూ ఉంటారు. ఇలా పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మంచివి అని ప్యాక్ లపై తెలుపుతున్నారు. ఇది చూసి ప్రజలు వాటిని తాగుతూ ఉంటారు.పట్టణ ప్రాంతాల ప్రజలు క్వాన్డ్ జ్యూస్ లు తాగేందుకు ఎంతో ఇష్టపడతారు. కానీ ఈ రకమైన జ్యూస్ ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుందని తెలియదు.
క్వాన్డ్ జ్యూస్ ప్రమాదకరమైనది : క్వాన్డ్ జ్యూస్ లలో ఎన్నో రకాల రుచులు కలుపుతున్నారు అని హెల్త్ పాలసీ నిపుణులు డాక్టర్.అన్షుమన్ తెలిపారు. వీటిని సహజ సిద్ధంగా పిలిచి మార్కెట్లలో ఉపయోగిస్తున్నారు. కానీ వాటిలో కృత్రిమ చక్కెర అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్ల రుచిని తీసుకువచ్చేందుకు క్వాన్డ్ జ్యూస్ లో షుగర్ కార్న్ సిరప్ ని ఎక్కువగా కలుపుతారు. ఈ రకమైన రసంలో ఫ్రొక్టోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ప్రస్తుతం చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీని వలన చిన్న పిల్లలు కూడా బాధితులుగా మారుతూ ఉన్నారు. ఫ్యాటీ లివర్ సమస్య పేరేగేందుకు ప్యాకేజీ జ్యూస్ కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ప్యాకేజీ జ్యూస్ తాగటం వలన టైప్ టు డయాబెటిస్, పార్టీ లివర్, గుండె సమస్యలు, డెమోన్షియా, బ్రెయిన్, ఫాగ్, క్యాన్సర్లు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని డాక్టర్. అన్షుమ న్ తెలిపారు.
ఈ రసం ఒక రకమైన ఖరీదైనటువంటి విషయం లాంటిది. ఇది ఎన్నో విధాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. ఇలాంటి ఫ్యాక్ జ్యూస్ లను ఎవరు కూడా తాగకూడదు. వీటిని ఎక్కువ సార్లు తాగటం వలన శరీరం ఎన్నో వ్యాధులకు నిలియంగా మారుతుంది అని తెలిపారు. ప్యాక్ చేసిన జ్యూస్ లో ఉండే చక్కెర ఇన్సూలిన్, రెసిస్టెన్స్ ప్రమాదాలను కూడా ఎంతో పెంచుతుంది. దాని తర్వాత మధుమేహానికి కూడా దారి తీయవచ్చు. ఈ జ్యూస్ కి ఆయుష్యు పెంచేందుకు ఎన్నో రకాల రసాయనాలు కూడా కలుపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రమాదకరం. జ్యూస్ కంటే పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని డాక్టర్. అన్షుమన్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లు తీసుకునేందుకు ప్రయత్నించండి. పండ్ల రసం అనేది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు…
క్వాన్డ్ జ్యూస్ తాగే ట్రెండ్ ఎందుకు పెరుగుతుంది
ఆహార పదార్థాలు మరియు పండ్ల రసాలపై వేసిన లేబులింగ్ అనేది వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి అని ICMR తెలిపింది. దీనితో ఇలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. క్వాన్డ్ జ్యూస్ లు అనేవి ఎంతో సులువుగా దొరుకుతాయి. పండ్లు రసం ఆరోగ్యకరమైనది అని ప్రజలు ఎక్కువగా భావిస్తారు. కానీ లేబులింగ్ ప్రకారం చూస్తే, పండ్ల రసంలో పోషకాలు అనేవి అసలు ఉండవు. లేబులింగ్ లో రాసినట్లు క్వాన్డ్ జ్యూస్ లో ఏమి ఉండవు అని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. మంచి లేబులింగ్ వేసిన తర్వాత జ్యూస్ చాలా ప్రయోజనంగా ఉంటుంది అని ప్రజలు అనుకోవద్దు అని తెలిపారు…