Tulasi Ginger Water : ఖాళీ కడుపుతో తులసి అల్లం నీరు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!

Tulasi Ginger Water : కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు తమ జీవన శైలిలో ఎన్నో మార్పులను కూడా చేసుకుంటున్నారు. అదే టైమ్ లో ఆరోగ్యంగా ఉండటం కోసం మంచి జీవనశైలి మరియు టైం కి నిద్ర లేవటం, వ్యాయామం చేయటంతో పాటుగా కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును మొదలుపెట్టడం లాంటి ఎంతో మెరుగైన ఉదయం దినచర్యను కలిగి ఉండటం చాలా అవసరం. అయితే మన దేశంలో మాత్రం చాలా మంది టీ లేక కాఫీలతో రోజున మొదలు పెడతారు. అయితే ఈ కాఫీ, టీకి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో మీ రోజును మొదలు పెట్టటం వలన మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని అంటున్నారు. మీ రోజును మొదలు పెట్టడంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకున్నట్లయితే కొన్ని రకాల తీవ్రమైన సమస్యల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.

Advertisement
Tulasi Ginger Water : ఖాళీ కడుపుతో తులసి అల్లం నీరు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...!
Tulasi Ginger Water : ఖాళీ కడుపుతో తులసి అల్లం నీరు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!

కాబట్టి ఉదయం పాలు లేక టీ, కాఫీలకు బదులుగా తులసి అల్లం నీరు తాగాలి అని అంటున్నారు. అయితే తులసి, అల్లం ఈ రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతినిత్యం తులసి అల్లం నీటిని తీసుకోవటం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి మరియు అల్లం ఈ రెండు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అయితే పరిగడుపున తులసి, అల్లం నీటిని తాగటం వలన జీర్ణ క్రియ మెరుగుపరటమే కాక బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ప్రతినిత్యం కూడా తులసి, అల్లం నీటిని తాగటం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అవి ఏమిటి అంటే.

Advertisement

ఖాళీ కడుపుతో తులసి అల్లం నీరు తాగటం వలన కలిగే ప్రయోజనాలు

1. యాంటీ ఫంగల్ లక్షణాలు : యాంటీ ఫంగల్,యాంటీ వైరల్, యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు అనేవి తులసిలో ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచటంతో పాటుగా గుండెను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. బరువు తగ్గించటంలో ఎఫెక్టివ్ : ప్రతినిత్యం కూడా ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీటిని తీసుకోవటం వలన బరువు సులభంగా తగ్గుతారు. అలాగే పొట్టలో ఉన్న కొవ్వు ను కూడా సులభంగా కరిగిస్తుంది.

3. మెరుగైన జీర్ణక్రియ : తులసిలో యుజినాల్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అల్లం లో మాత్రం జింజెరార్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటుగా కొవ్వును తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది.

4. బలమైన రోగనిరోధక శక్తి : ఎవరైనా సరే ప్రతినిత్యం కూడా ఆరోగ్యానికి గురవుతూ ఉన్నట్లయితే లేక వాతావరణ మారటం వలన జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నట్లయితే, దాని నుండి వెంటనే బయటపడాలి అనుకుంటే, ప్రతిరోజు ఉదయం అల్లం తులసి నీరు తాగితే చాలా మంచిది.

5. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు : తులసి అల్లంతో తయారైనటువంటి ఈ పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు కూడా ఇది ఎంతగానో పనిచేస్తుంది. అంతేకాక శరీరాన్ని సహజంగా డిటాక్సి ఫై చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతినిత్యం గనుక ఈ డ్రింక్ ను తీసుకున్నట్లయితే,నోటి దుర్వాసన నుండి కూడా దూరంగా ఉండవచ్చు…

Author