Coconut Water : వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం… ఎందుకంటే…!

Coconut Water : వేసవికాలం రానే వచ్చింది. విపరీతమైన ఎండలతో ప్రజలు సతమత మైపోతున్నారు.మండే ఎండల వలన గొంతు ఎండిపోవడం , తలనొప్పి, డిహైడ్రేషన్ ,అలసట వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఎండల నుండి ఈ ప్రభావాన్ని తట్టుకోవడానికి కొబ్బరి నీళ్లు బెస్ట్ డిహైడ్రేషన్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వలన ఎండ తగ్గడమే కాకుండా డిహైడ్రేషన్ తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో నీరసాన్ని తగ్గించి శరీరాన్ని డిహైడ్రేడ్ గా కాపాడేందుకు కొబ్బరి నీళ్లు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కొబ్బరి నీళ్ల లో 94% నీరు ఉంటుంది. అలాగే ఇందులో కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా 950 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 2 గ్రాముల ప్రోటీన్స్, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వాటితోపాటు విటమిన్ సి 10%, మెగ్నీషియం 15%, పొటాషియం 17%, మాంగనీస్ 17%, క్యాల్షియం 6%, సోడియం 11% శాతం ఉంటాయి. అందుకే వేసవిలో కొబ్బరి నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Advertisement
Coconut Water : వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం... ఎందుకంటే...!
Coconut Water : వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం… ఎందుకంటే…!

Coconut Water : శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తాయి.

అలాగే కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉండడం వలన ఇది శరీరం నుంచి అదనపు నీటిని మరియు వ్యర్ధ పదార్థాలను తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది.

Coconut Water : జీర్ణ క్రియకు మేలుచేస్తుంది…

కొబ్బరినీరు తాగడం వలన కడుపు చల్లబడుతుంది మరియు పేగుల కదలికలను శుభ్రం చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నీటిలో అల్కనీల్ గుణాలు యాసిడిటీకి చెక్ పెడతాయి. అలాగే ఈవీపీహెచ్ ను బ్యాలెన్స్ చేస్తాయి. అదేవిధంగా కొబ్బరినీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ మినరల్స్ మరియు విటమిన్లు కూడా ఉంటాయి.అలాగే కొబ్బరినీళ్లు జీర్ణ క్రియలకు మంచి మేలు చేస్తుంది.

Coconut Water : గర్భిణీలకు మంచిది…

అలాగే కొబ్బరినీళ్ళను గర్భిణీలు తాగడం వలన వారికి మంచి ఉపయోగం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనిలో ఉండే విటమిన్ బి 9 కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.

Coconut Water : షుగర్ పేషెంట్స్…

అయితే చాలామంది కొబ్బరి నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అపోహలో ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. కొబ్బరి నీళ్ళు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అంతేకాక ఇది టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది