Coriander Juice : కొత్తిమీరను కేవలం ఆహారంలో రుచికోసం మరియు ఆహార అలంకరణ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ కొత్తిమీర వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.. ప్రతిరోజు కొత్తిమీర జ్యూస్ ని తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర యొక్క ఆకు ,కాండం మరియు వేరు అన్నిటిలో ఔషధ గుణకాలు ఉన్నాయి. కొత్తిమీర జ్యూస్ ని తీసుకోవడం ద్వారా శరీరంలో ఉండే అనేక వ్యాధులు నయమవుతాయట. కొత్తిమీరలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెరటి , యాంటీ మైక్రోబాయల్, యాంటీ మ్యూటజెనిక్ వంటి లక్షణాలు మూత్రపిండాల యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయ పడతాయి . అదేవిధంగా డయేరియాకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఇది సహాయపడుతుంది. అయితే కొత్తిమీర జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి కొత్తిమీర జ్యూస్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకు నీటిని పరిగడుపున తాగడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. మరియు కొలెస్ట్రాల స్థాయి నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీరలో యాంటీ ఇన్ప్లమెటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని పరిగడుపున తాగినట్లయితే కీళ్ల నొప్పులు , కీళ్ల వాపులు వంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వలన మూత్రపిండాలతో పాటు అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.
కొత్తిమీర జ్యూస్ కడుపు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కడుపునొప్పి ఉన్నవారు కొత్తిమీర రసం తాగడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశవనం పొందడం కోసం ఒక గ్లాస్ నీటిలో కొత్తిమీర , జీలకర్ర , పంచదార, టీ ఆకులు మరిగించిన నీటిని తాగడం ద్వారా ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పిరియడ్స్ సంబంధిత సమస్యలు ఉన్న ఆడవారు. అలాగే పీరియడ్స్ సమయానికి రానివారు మరియు సాధారణ కంటే అధికంగా ఉన్న మహిళలు కొత్తిమీర నీటిలో పంచదార వేసుకొని తాగడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు.
Coriander Juice కొత్తిమీర జ్యూస్ తయారీవిధానం..
కొత్తిమీర జ్యూస్ తయారు చేయడం కోసం కొత్తిమీర , నిమ్మకాయ, ఉప్పు తగినన్ని నీళ్లను తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన కొత్తిమీరను కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దానిని వడపోసి అందులో నిమ్మకాయ రసం తగినంత ఉప్పు వేసుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.