Almonds : డ్రై ఫ్రూట్స్ తో షుగర్ కంట్రోల్… రోజుకి ఇన్ని మాత్రమే తినాలి…!

Almonds : ప్రస్తుత కాలంలో ఆరోగ్య కోసం చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పోషకాహారం విషయములో ముందు వరుసలో ఉంటాయి. వీటిని తీసుకోవటం వలన చక్కటి ఆరోగ్యాన్ని కూడా మన సొంతం చేసుకోవచ్చు అని నిపునులు అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం బాదంపప్పు తీసుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని పోషకాహార నిపుణులు తెలిపారు. నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును ప్రతిరోజు తీసుకోవటం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అని అంటున్నారు. మంచి జర్ణ క్రియను కూడా నిర్వహించేందుకు బాదం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. బాదం కూడా గుండెను ఆరోగ్యంగా ఉచ్చటంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అలాగే గుండె సమస్యల ప్రమాదాలను నియంత్రిస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, ఇన్సులిన్ ప్రభావాన్ని కూడా పెంచగలదు. బాదం చర్మాన్ని ఎంతో తాజాగా ఉంచగలదు.

Advertisement
Almonds : డ్రై ఫ్రూట్స్ తో షుగర్ కంట్రోల్... రోజుకి ఇన్ని మాత్రమే తినాలి...!
Almonds : డ్రై ఫ్రూట్స్ తో షుగర్ కంట్రోల్… రోజుకి ఇన్ని మాత్రమే తినాలి…!

బాదం లో ఉన్న విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని కూడా పెంచుతాయి. దీని వలన చర్మం అనేది ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. బాదం ఎముకలను బలోపేతం చేయగలదు. బలమైన ఎముకలకు కూడా కాల్షియం, ఫాస్ఫరస్ ఎంతో అవసరం. బాదంలో ఈ రెండు కూడా ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. అయితే బరువు నియత్రించాలి అనుకునేవారు రోజు బాదం పప్పులు కచ్చితంగా తీసుకుంటే మంచిది. బాదంపప్పు తినడం వల్ల కొవ్వు అనేది కూడా పెరగదు.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా ప్రభావితంగా పని చేయగలదు. ఈ బాదం పప్పును ప్రతిరోజు తీసుకోవటం వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ ను అతిగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు…

Advertisement

అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, బాదం పప్పులు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు పెద్దలు రోజు 20 వరకు బాదం పప్పులు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే తీసుకోవడం వలన ఎంతో మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. అయితే చిన్నపిల్లలకు రోజుకు మూడు, నాలుగు బాదం పప్పులు తినిపించవచ్చు అని అంటున్నారు. అలాగే నాలుగు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు రోజుకు ఐదు లేక ఎనిమిది బాదం పప్పులు తీసుకోవటం చాలా మంచిది. 9 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారికి 10 బాదం పప్పులు చాలా అవసరం. అయితే వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు అని నిపుణులు అంటున్నారు….

Author