Food Safety Tips : ప్రస్తుతం బెంగుళూరు రాష్ట్ర ప్రభుత్వం ఆహార తయారీలో కృత్రిమ రంగులను వాడటం నిషేధించింది. కొత్తగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్, ఫిష్, వెజ్ కబాబ్ లాంటి ఆహారంలో కృత్రిమ రంగులను వాడవద్దు అని ఆదేశాలను జారీ చేసింది. అయితే చేపలు, కబాబ్ లు, చికెన్ లలో కృత్రిమ రంగులు వాడకాన్ని నిషేధించడానికి గల కారణాలు ఏమిటి. ఈ రంగులను ఆహారంలో ఉపయోగించటం వలన ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఇది ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాల గురించి బెంగళూరులోని ఆహారా నిపునుడు డాక్టర్ కీర్తి హిరిసావే తెలియజేశారు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
డాక్టర్ కీర్తి హిరిసావే మాట్లాడుతూ, ఆహార తయారీలో కృత్రిమ రంగులు రుచిని పెంచడంతో పాటుగా అవి ఆకర్షణీయ రంగును పులిముకుంటాయి. దీంతో ఆహారం అనేది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ వీటిని తినడం వలన శరీరంలోని ఇతర అవయవాలపై చెడు ప్రభావం అనేది పడుతుంది. ఆహార తయారీ లో కృత్రిమ రంగుల వాడటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి వాడకం వలన బీపీ, షుగర్ పెరిగి, కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చికెన్ కబాబ్ లను పరీక్ష కోసం ల్యాబ్ కు పంపగా దీనిలో 8 కబాబ్ లకు కృత్రిమ రంగులు వేసినట్లుగా కనుక్కున్నారు. దీనిలో మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ ఎల్లో కలర్స్ అనేవి ఎంతో ప్రమాదం. ఈ కృత్రిమ రంగులలో కాస్మోసిస్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది.ఈ కాస్మోసిన్ అనేది కూడా ఒక రసాయన కారకం. ఈ కాస్మోసిన్ అనేది ఆహార పదార్ధాలను ఎరుపుగా మారుస్తుంది. ఈ కార్మోసిన్స్ అనేవి కిడ్నీలను ఎంతగానో దెబ్బతీస్తాయి..
ఆహారంలో 100 pp కంటే ఎక్కువ కాస్మోసిన్ వాడినట్లయితే,అప్పుడు ఆహారం అనేది చాలా ఎర్రగా కనిపిస్తుంది. అంతేకాక ఈ కాస్మోస్న్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చిన్నతనంలోనే పిల్లలకు బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటుగా గుండెపోటుతో సహా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని డాక్టర్ కీర్తి హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ కలర్ లపై నిషేధం విధించటంతో పాటుగా ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష రూ.10 లక్షల వరకు జరిమానాలతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటాము అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు ఓ ప్రకటనలో హెచ్చరించారు…