Tea Biscuits : టీ తోపాటు బిస్కెట్లను కలిపి తింటున్నారా… అయితే ఇవి తప్పక తెలుసుకోండి…!

Tea Biscuits : టీ తో బిస్కెట్స్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా టీ తోపాటు రకరకాల స్నాక్స్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో గోధుమపిండి మరియు మైదాతో చేసిన పిండి బిస్కెట్లు అధికంగా ఉంటాయి. ఇక ఈ బిస్కెట్లలో మైదాపిండితో చేసినవి చాలా రుచిగా ఉంటాయి కాని ఇవి తినడం వలన అనారోగ్యానికి దారి తీస్తాయి. అయితే టీ తో కలిపి పిండి బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి ఎందుకు హానికరం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Tea Biscuits టీ తోపాటు బిస్కెట్లను కలిపి తింటున్నారా అయితే ఇవి తప్పక తెలుసుకోండి
Tea Biscuits టీ తోపాటు బిస్కెట్లను కలిపి తింటున్నారా అయితే ఇవి తప్పక తెలుసుకోండి

Tea Biscuits : హై గ్లైసినిక్ ఇండెక్స్

హై గ్లైసినిక్ ఇండెక్స్ అనేది పిండి పదార్ధలలో ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వలన శరీరంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ ఆహారం ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఏమాత్రం మంచిది కాదు. దానితో పాటుగా గ్లూకోస్ స్థాయిలు తగ్గడం మరియు ఇన్సులిన్ నిరోధకత వంటి ప్రమాదాలు కుడా వచ్చే అవకాశం ఉంది. కావున వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

Advertisement

Tea Biscuits బరువు పెరగడం

బిస్కెట్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వలన బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడతాయి. తద్వారా ఆకలి ఎక్కువగా వేస్తుంది. దీంతో అధిక మొత్తంలో బిస్కెట్లను తినేస్తారు. తద్వారా అధికంగా బరువు పెరుగుతారు.

Tea Biscuits : పోషకాలు లేకపోవడం

పిండి బిస్కెట్లలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో ఖనిజాలు విటమిన్లు ఫైబర్లు వంటివి ఉండవు కాబట్టి శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. కావున అనారోగ్యానికి ఎక్కువగా గురవుతారు.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం.

పిండి బిస్కెట్లలో సంతృప్త కొవ్వులు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ వంటివి ఉండవచ్చు. దీని వలన గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కొవ్వుల కారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల స్థాయిలు గణనీయంగా తగ్గిపోవచ్చు. కాబట్టి గుండె జబ్బులు త్వరగా వస్తాయి.

జీర్ణక్రియ సమస్యలు.

పిండి పదార్థాలు జీర్ణవ్యవస్థని దెబ్బతీస్థాయి. ఇవి మలబద్ధకం అజీర్ణం ఆమ్లత్వం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అలగే పిండిలో ఫైబర్ ఉండదు కాబట్టి ఇది జీర్ణ ప్రక్రియను మందగించేలా చేస్తుంది. అలాగే కడుపులో ఉబ్బరం , మంట వంటి ఇబ్బందికర సమస్యలు కుడా వస్తాయి. కావున పిండితో తయారుచేసిన బిస్కెట్లను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

Author