Mango : పండ్లల్లో రారాజు మామిడి పండు. దీని రుచికి సాటి మరో కటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరికి కూడా మామిడి పండ్లను చూస్తే చాలు నోరూరుతుంది. దీనిని ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. రుచిలో మాత్రమే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిని తినటానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. మరి మీరు కూడా మామిడి పండ్లను సరైన పద్ధతిలోనే తింటున్నారా. ఒకసారి ఆలోచించండి. పండ్లను తినటానికి కూడా పద్ధతులు ఏమిటి అని ఆలోచిస్తున్నారా. అవును మామిడి పండ్ల మీద ఒక రకం ఫైటిక్ ఆమ్లం అనేది ఉంటుంది.
ఇది గనక చర్మానికి తగిలితే అలర్జీ అనేది వస్తుంది. దురద కూడా వస్తుంది. అందువలన మామిడి కాయలను, పండ్లను కడగటం చాలా అవసరం. తుడిమ వద్ద అంటుకొని ఉన్న సోనా పూర్తిగా పోయేవరకు శుభ్రం చేయాలి. దీనికోసం మామిడి పండులను నీటిలో అరగంటసేపు నానబెట్టి తర్వాత కడిగితే చాలా మంచిది. దీని వలన అధికంగా ఉన్న ఫైటిక్ ఆమ్లం అనేది తగ్గుతుంది…
ఆయుర్వేద ప్రకారం చూస్తే, భోజనంతో పాటుగా పండ్లను తినకూడదు. కానీ మామిడి పండ్లు దీనికి మినహాయింపు. వీటిని పాలతో కలిపి తీసుకోవటం వలన మంచి బలవర్థకంగా పనిచేస్తుంది. అంతేకాక శృం.. మీద కూడా ఎంతో ఆసక్తి పెంచుతుంది. పిత్త,వాత దోషాలను కూడా తగ్గిస్తుంది. అయితే జీర్ణ సమస్యలు రుమటాయిడ్, అర్ధయిటీస్, సోరియాసిస్ లాంటి ఆటో ఇ మ్యూన్ జబ్బులు చర్మ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లను పాలతో కలిపి అసలు తినకూడదు…
ఇక మామిడి పండులో యాంటీ యాక్సిడెంట్లు గుణాలతో కూడిన గ్యాలటానిన్లు, మ్యాంగి పెరిన్ లాంటి వృక్ష రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి విశ్రంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్లుగా అధ్యయనాలు తెలిపాయి. అయితే తొక్కతో పాటు తింటేనే అనేవి అందుతాయి. ఎందుకంటే. ఇవి తొక్క కింద మాత్రమే ఉంటాయి కాబట్టి. మామిడి పండ్లు అనేవి విసర్జన సాఫీగా అయ్యేలా కూడా చేస్తాయి. ఇవి దీర్ఘకాల మల బద్దకం తగ్గించడానికి తోడ్పడుతున్నట్లుగా బయటపడింది.
మామిడి పండులో విటమిన్ ఎ,సి అనేవి అధిక మోతాదులో ఉంటాయి. ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి కోలాజెన్ ఏర్పడటంలో కూడా పాలు పంచుకుంటాయి. అనగా ఇవి చర్మం నిగనిగకు తోడ్పడతాయి అన్నమాట. అంతేకాక వృద్ధాప్య ఛాయాలను కూడా తగ్గిస్తుంది…