Hair : చిన్నతనంలోనే జుట్టు నెరవడానికి కారణాలు ఏమిటో తెలుసా…!

Hair : ఈ కాలంలో వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు నెరవడం అనేది సాధారణంగా మారింది.కానీ ప్రస్తుత కాలంలో మాత్రం చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే. ప్రస్తుతం యువతలో ఈ సమస్య అనేది సర్వ సాధారణంగా మారింది అని చెప్పొచ్చు. అయితే పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం తో పాటు దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల చిన్న పిల్లల వయసు అనేది ఎక్కువగా కనిపించి క్రమంగా వారిలో ఆత్మాన్యూన్యత భావం అనేది కలుగుతుంది…

Hair : చిన్నతనంలోనే జుట్టు నెరవడానికి కారణాలు ఏమిటో తెలుసా...!
Hair : చిన్నతనంలోనే జుట్టు నెరవడానికి కారణాలు ఏమిటో తెలుసా…!

సాధారణంగా తెల్ల జుట్టును నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వాటిని దాటేందుకు ఎంతోమంది హెయిర్ కలర్స్ ను కూడా వాడుతూ ఉంటారు. ఇది మాత్రం శాశ్వత పరిష్కారం కానే కాదు. దాని కంటే ముందు చిన్నతనంలోనే జుట్టు నెరవడానికి అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అయితే చిన్నతనంలోని జుట్టు తెల్లగా మారటానికి గల కారణాలను ఘజియాబాద్ లోని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య సెచ్ దేవా తెలిపారు.ఆమె దీని గురించి ఏం చెప్పారంటే. ప్రస్తుత కాలంలో 16 నుండి 28 ఏళ్ల పిల్లల్లో జుట్టు నడవడం ఎక్కువగా కనిపిస్తుంది.దీని వెనక కూడా ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే వ్యవస్థగత కారణాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు. మీ శరీరంలో పలు రకాల పోషకాలు అనేవి లేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది అని అన్నారు.అయితే జుట్టు తెల్లబడటానికి గల కారణాలు అన్వేషించేందుకు బి-12, d3, థైరాయిడ్, సిర్రం, ఫెర్రిటిన్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది…

ఈ బెడ్ టెస్ట్ లు చేయించడం ద్వారా శరీరంలో ఏ విటమిన్ లోపం ఉందో తెలుస్తుంది. దీని ఆధారంతో వైద్యులు దానికి సంబంధించిన సప్లిమెంట్ లను ఇస్తూ ఉంటారు. అలాగే అనారోగ్యకరమైన జీవన శైలి వలన కూడా జుట్టు నెరవటానికి ప్రధాన కారణం అని అంటున్నారు. వీటిలో మద్యం, సిగరెట్, జంక్ ఫుడ్, ఇతర వ్యసనాలు ఎక్కువగా తీసుకోవటం మరియు రాత్రి లేటుగా నిద్రపోవటం, ఉదయాన్నే సరైన టైం కు నిద్ర లేవకపోవడం లాంటి వాటితో పాటుగా చెడు ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం అని అంటున్నారు. ఈ జీవనశైలి కారకాలు అన్నీ కూడా జుట్టును ఎంతో ప్రభావితం చేస్తాయి.అంతేకాక ఈరోజులలో కూరగాయలలోను మరియు పండ్ల లోని ఎన్నో రకాల రసాయనాలను కూడా కలుపుతున్నారు. వీటిని తీసుకోవడం వలన కూడా జుట్టు అనేది తొందరగా నేరుస్తుంది అని తెలిపారు. ఇక కొన్ని సమస్యలైతే వంశపారపర్యంగా రావడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి వాటిలలో జుట్టు తెల్లబడటం కూడా ఒకటి. అయితే పిల్లల తల్లిదండ్రులకో లేక వాళ్ళ తాత ముత్తాతలకో చిన్నతనంలో జుట్టు నేరిసె సమస్య ఉన్నట్లయితే వారికి కూడా చిన్న వయసులోనే జుట్టు నేరిసే సమస్య వస్తుంది అని అంటున్నారు…

Author