Sugarcane Juice : సమ్మర్ చెరుకు రసం అమ్మే బండ్లకు కొదువే ఉండదు. మార్కెట్ లో రోడ్డు మీద ఎక్కడ చూసినా సరే ఇవే కనిపిస్తుంటాయి. అయితే చెరుకు రసంతో చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం లాంటివి చాలానే పోషకాలు ఉంటాయి. ఇది చల్లదనానికి ఎక్కువగా పని చేస్తుంది. బాడీలో నీటి శాతాన్నికాపాడటంలో బాగానే పని చేస్తుంది. దాంతో పాటు అనేక వ్యాధులను నయం చేయడంలో సాయం చేస్తుంది. ఇక జీర్ణ సమస్యలకు, ఎముకల ఆరోగ్యానికి బాగానే సాయం చేస్తుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు అస్సలు తాగొద్దు. అవేంటో తెలుసుకుందాం.
Sugarcane Juice నిద్రలేమి సమస్య..
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారి చెరుకు రసం అస్సలు తాగొద్దు. ఎందుకంటే ఇందులో పోలికోసనాల్ ఉంటుంది. ఇది నిద్రకు ప్రతికూలంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మీకు నిద్రలేమి సమస్య ఎక్కువ అవుతుంది. ఒత్తిడి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది.
Sugarcane Juice బ్లడ్ లో షుగర్ ఉన్న వారు..
ఈ రోజుల్లో డయాబెటిక్ సమస్య అనేది చాలా కామన్ అయిపోతుంది. చిన్న వయసువారిలో కూడా కనిపిస్తోంది. అయితే షుగర్ వ్యాధి ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరుకు రసం అస్సలు తాగొద్దు. ఎందుకంటే చెరుకులో చెక్కర శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు చెరుకు రసానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
Sugarcane Juice ఊబకాయం సమస్య..
ఊబకాయంతో బాధపడుతున్న వారు కూడా చెరుకు రసానికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే చెరుకు రసంలో కూడా కేలరీల కంటెంట్ ఎకకువగా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. పైగా ఇందులో షుగర్ కూడా ఉంటుంది కాబట్టి దాని వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీరు దూరంగా ఉండాలి.
Sugarcane Juice అజీర్ణంతో బాధపడేవారు..
జీర్ణ సంబంధిత సమస్యలుఉన్న వారు చెరుకు రసాన్ని అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే చెరుకు రసంలో పోలికోసనాల్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కడుపు సంబంధిత సమస్యలుఉన్న వారు చెరుకు రసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Sugarcane Juice జలుబు, దగ్గు..
జలుబు చేసిన వారు కూడా చెరుకు రసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే చెరుకు రసంలో ఉండే కొన్ని లక్షణాల వల్ల జలుబు, దగ్గు మరింత పెరుగుతుంది. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యలు మరింత పెరుగుతాయి కానీ తగ్గవు. అంతే కాకుండా తలనొప్పి కూడా వస్తుంది.