Stomach : ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకండి… చాలా ప్రమాదం…!

Stomach : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే. టైంకి తినటం చాలా అవసరం. అయితే ఉదయం అల్పాహారం రోజు లో ముఖ్యమైన భోజనంగా చెబుతారు. ఇది శరీరానికి శక్తిని ఇవ్వటమే కాక రోజంతా మన జీవక్రయని కూడా సెట్ చేస్తోంది. అయితే అల్పాహారానికి ముందు కొన్ని ఆహారాలు తీసుకోవటం వలన మన ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. ఇలాంటి విషయాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ మరియు కాఫీ తో పాటు అల్పాహారానికి ముందు అనగ ఖాళీ కడుపుతో మనం ఏమి తినకూడదు. నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి మనం తరచుగా ఉదయం నిద్ర లేచిన తరువాత ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని పదార్థాలు తీసుకుంటూ ఉంటాము. దీని వలన పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కావున అల్పాహారములో అనా రోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి. దానితో పాటుగా అల్పాహారానికి ముందు కొన్ని ఆహారాలను తినకూడదు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.

Stomach : ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకండి... చాలా ప్రమాదం...!
Stomach : ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకండి… చాలా ప్రమాదం…!

Stomach : ఖాళీ కడుపుతో వీటిని తినకండి

సిట్రస్ పండ్లు జ్యూస్ :- నారింజ మరియు నిమ్మ,ద్రాక్ష లాంటి సిట్రస్ పండ్లను వాటి రసాలను ఖాళీ కడుపుతో తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పండ్లల్లో అధిక ఆమ్లాలు అనేవి ఉంటాయి. ఇది కడుపులో ఆమ్లతను ఎంతగానో పెంచుతాయి. దీని వలన కడుపులో మంట,అల్సర్ లాంటి సమస్యలు వస్తాయి…

Stomach అరటిపండు

అరటిపండు లో విటమిన్లు మరియు మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవటం వలన పొటాషియం మరియు మెగ్నీషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీని కారణం గుండె కొట్టుకోవటం సక్రమంగా మారవచ్చు. దీనితో పాటుగా కడుపులో ఆమ్లత్వం అనేది కూడా పెరుగుతుంది…

Stomach : శీతల పానీయాలు

శీతల పానీయాలు మరియు ఎనర్జీ డ్రింక్స్ చల్లని నీరు కూడా ఖాళీ కడుపుతో అసలు తీసుకోకూడదు. ఇది జీర్ణ వ్యవస్థను ఎంతో ప్రభావితం చేయగలదు. ఇంకా గ్యాస్టిక్ లాంటి సమస్యలను కూడా కలిగిస్తుంది…

టీ,కాఫీ : చాలా మంది రోజులో కాఫీ లేక టీతో మొదలు పెడతారు. అయితే ఖాళీ కడుపుతో కెఫీన్ తీసుకోవటం వలన పొట్టలో ఎసిడిటీ పెరిగి గ్యాస్టిక్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున దీనికి బదులుగా ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవటం చాలా మంచిది…

బన్స్, స్వీట్లు : ఎంతో రుచికరమైన బన్స్ లేక రొట్టెలు ఇతర స్వీట్లు ఖాళీ కడుపుతో అసలు తినకూడదు. ఇవి ఎక్కువ మొత్తంలో చక్కెర మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. కావున ఇవి తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది శక్తిలో అకస్మాత్తుగా పెరుగుదల మరియు క్షీణతకు కూడా కారణం అవుతుంది. ఇది మిమ్మల్ని తొందరగా అలిసిపోయేలా కూడా చేయగలదు…

పెరుగు : పెరుగు అనేది ఎంతో పౌష్టికాహారం. కానీ దీనిని కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. ఇలా చేయటం వలన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్ లను కూడా నాశనం చేస్తుంది. ఇంకా కడుపులో అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది…

Author