Water Heaters : వాటర్ హీటర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా… అయితే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..!

Water Heaters : వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో బయట తడి తడిగా ఉంటుంది. అలాగే చల్లటి వాతావరణం నెలకొంటుంది. ఇక రోజంతా కురిసే వర్షంలో స్కూల్స్ కాలేజీ ఉద్యోగాలకి వెళ్లేవారు అవస్థలు పడక తప్పదు. ముఖ్యంగా ఉదయాన్నే స్నానం చేద్దామంటే ట్యాప్ వాటర్ చల్లగా వస్తాయి. ఇక దీంతో చాలామంది వేడి నీటితో స్నానం చేస్తారు. దాని కోసం కొంతమంది గ్రీజర్ ని ఉపయోగిస్తుంటే మరి కొంతమంది గ్యాస్ స్టవ్ పై నీటిని వేడి చేసుకుంటారు. మరి కొంతమంది వాటర్ హీటర్ ను ఉపయోగిస్తారు. అయితే వాస్తవానికి చాలామంది వాటర్ హీటర్స్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ హీటర్ అందరికీ అందుబాటు అయ్యే ధరలో ఉంటుంది. అలాగే త్వరగా నీటిని వేడి చేస్తుంది. కాబట్టి ఎక్కువ మంది దీనినే వాడుతారు. మరి ఎలక్ట్రానిక్ వాటర్ హీటర్ వాడడం వలన కలిగే అనారోగ్య సమస్యలతో పాటుగా ఇతర నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Water Heaters : వాటర్ హీటర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా... అయితే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..!
Water Heaters : వాటర్ హీటర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా… అయితే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..!

ఎలక్ట్రానిక్ వాటర్ హీటర్ ద్వారా నీరు త్వరగా వేడెక్కుతాయి. అయితే ఆ నీటితో స్నానం చేస్తే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాటర్ హీటర్ తో వేడి చేసిన నీటితో స్నానం చేయడం వలన చర్మానికి సంబంధించి పొక్కులు , దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు విడుదలవుతాయి. ఈ వాయువుల కారణంగా వికారంగా ఉండడం తలనొప్పి శ్వాస కోస సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా వాటర్ హీటర్ తో ఎక్కువ వేడి చేసిన నీటితో స్నానం చేయడం వలన గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని గుండెపోటు , హాట్ ఎట్టాక్ వంటి గుండె సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వాటర్ హీటర్ వలన అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు. ఎందుకంటే వాటర్ హీటర్ వాడాలి అంటే అధిక మొత్తంలో విద్యుత్ ని వినియోగించాలి. దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరికొన్ని హీటర్లు అయితే తరచూ రిపేర్స్ వస్తూ ఉంటాయి. వాటిని బాగు చేయించడానికి లేదా కొత్తవి కొనుక్కోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే నాణ్యతలేని వాటర్ హీటర్ వాడటం వల్ల పెద్ద ప్రమాదాలు జరగవచ్చు. ఒకవేళ మీరు తప్పనిసరిగా వాటర్ హీటర్ వాడాలి అనుకుంటే ధర ఎక్కువైనా క్వాలిటీ ఉన్న వాటర్ హీటర్ వాడడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.

Author