Cool Drinks : ప్రస్తుత కాలంలో చాలా మంది బయట ఆహారని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాని బయట దొరికే ఆహారం తినడం అంత మంచిది కాదు.ఎందుకంటే బయట ఆహారంలో కారం మరియు మసాలాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే ఎక్కువగా వేయించుతారు. ఇలా వేయించిన ఆహారం తినడం వలన గుండెల్లో మంట వస్తుంది. దీని వలన ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇలా బయట ఆహారాన్ని తిన్న ద్వారా గ్యాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి ఆహారాలను తినడం వలన కడుపులో అజీర్తి చేస్తుంది. దీనికోసం కొందరు చల్లటి పానీయాలను ఆగుతుంటారు. దీనివల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందువచ్చు అని అనుకుంటారు. మరికొందరైతే నీటిలో ఉప్పుని కలుపుకొని తాగుతారు.తద్వారా ఇది ప్రెగులను శుభ్రం చేస్తుంది మరియు కదిలికలను సులువు చేస్తుంది. అలాగే మరి కొంతమంది చల్లటి నీటిని తాగుతారు.అయితే అసలు ఏ నీరుని తాగితే అజీర్తికి ఉపశమనం కలుగుతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం…
Cool Drinks : యాంటాసిడ్ మందులు…
చాలామంది అజీర్తి గా ఉన్నప్పుడు దాని నుండి వెంటనే ఉపశమనం పొందేందుకు యాంటాసీడ్ మందులను వాడుతారు.కానీ ఈ మందులు అన్ని వేళలా ఉండవు మరియు ఇవి ఎక్కువ గా వాడడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అందువలన చాలామంది ఇంట్లోనే కొన్ని చిట్కాలను వినియోగిస్తూ ఉంటారు. దానిద్వారా అజీర్తి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే కొంతమంది జీలకర్ర నీరు తాగడం ద్వారా ఉపశమనం పొందుతారు. మరి కొంతమంది ఇంటి చిట్కాలకు బదులుగా కొన్ని శీతల పానీయాలను మరియు ఆల్ ఇన్ వాటర్ వంటిని తీసుకుంటారు. దీని ద్వారా ఆరోగ్యం పాడై అవకాశం ఉంటుందట.
Cool Drinks శీతల పానీయాలు విషం తో సమానం..
అయితే కొంతమంది శీతల పానీయాలు తాగడం వలన అజీర్తి నుండి ఉపశమనం పొందవచ్చు అని వాటిని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తాగడం అసలు మంచిది కాదు. ఎందుకంటే శీతల పానీయాలలో సోడా ఉంటుంది. ఇది నురుగును కలిగిస్తుంది. దానితోపాటుగా ఈ పానీయాలలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు చక్కెర కూడా అజీర్తిని సృష్టిస్తుంది కాబట్టి అజీర్తి సమయంలో శీతల పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటితో పాటుగా చల్లని నీటిని కూడా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే రక్తనాళాలు కూచించుకుపోతాయి. దీనివల్ల రక్తప్రసరణలో ఇబ్బంధి ఉంటుంది. అంతేకాక ఇవేమీ కూడా అజీర్తి సమస్యలను దూరం చేయవు బదులుగా కొత్త సమస్యలను సృష్టిస్తాయి.
Cool Drinks వేడి నీళ్లు తాగితే మంచిది..
అజీర్తి సమస్య నుంచి బయటపడడానికి శీతల పానీయాలు మరియు చల్లని నీటి కన్నా డిస్టల్డ్ వాటర్ ఎక్కువ తాగడం వలన ఉపయోగం ఉంటుంది. అయితే ఇందులో గోరువెచ్చటి నీటితో పాటు అల్లం రసం నిమ్మకాయ కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే నీటిలో జీలకర్ర మరిగించి తాగిన మంచి ఫలితాలు పొందవచ్చు.