Coconut Water : కొబ్బరి నీళ్లను ఆరోగ్యం కోసం ఎంతోమంది తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కొబ్బరి నీళ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఈ నీళ్లను ప్రతినిత్యం ఎవరో ఒకరు తాగుతూనే ఉంటారు. ప్రజలకు అనారోగ్యం పాడైన లేక డిహైడ్రేషన్ కి గురైనప్పుడు వైద్యులు ఎక్కువగా కొబ్బరి నీళ్లను తాగమని చెబుతూ ఉంటారు. అంతేకాక చాలామంది కొబ్బరి నీళ్లను వేసవి కాలంలో సమ్మర్ సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు సముద్ర తీరానికి వెళ్లినప్పుడు కూడా అక్కడ ప్రజలు ఈ కొబ్బరి నీళ్లను తాగుతూ ఆనందిస్తారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ కొబ్బరి నీళ్లను తీసుకోవటం వలన మన శరీరంలో నీటి కొరత ఏర్పడదు. ఈ కొబ్బరి నీళ్లు తాగటం వలన డిహైడ్రేషన్ ను నియంత్రిస్తుంది. అందువలన ఈ కొబ్బరి నీళ్ళకు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటికి ఎంతో డిమాండ్ ఉన్నది. నిజం చెప్పాలంటే కొబ్బరి నీళ్లను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిది. ఈ కొబ్బరి నీళ్లనేవి మన దాహాన్ని తీర్చటమే కాక ఎన్నో వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. ఈ కొబ్బరి నీళ్లను తీసుకోవటం వలన ఏఏ వ్యాధులు మరియు సమస్యలు తొలగిపోతాయో తెలుసుకుందాం.
Coconut Water కొబ్బరి నీళ్లనేవి ఈ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అవేంటో చూద్దాం…
ఊబకాయం : ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు. కానీ ఇది ఎన్నో రకాల వ్యాధులను కారణం అవుతుంది. కావున బరువు తగ్గటానికి మరియు పొట్టకొవ్వును తగ్గించడానికి ఈ కొబ్బరి నీళ్ళ ను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇలా చేసినట్లయితే కొద్ది రోజుల్లోనే మీ శరీరం ఎంతో చక్కగా మారుతుంది.అధిక రక్తపోటు : అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటే ఎంతో మంచిది. ఎందుకు అంటే. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. అంతేకాక కొవ్వును తగ్గించటం వలన బీపీ అనేది సాధారణ స్థితికి వస్తుంది. అందువలన ఈ సహజ పానీయాన్ని ప్రయోజనకరంగా చెబుతారు..
గుండె జబ్బులు : మన భారత దేశంలో గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. అందువల్ల ఈ కొబ్బరి నీళ్లను ప్రతి ఒక్కరు తాగాలి. ఇది గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరి వ్యాధి, ట్రిపుల్ నరాల వ్యాధి ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది.ఇన్ఫెక్షన్ నుండి రక్షణ : కరోనాకాలం వచ్చి పోయిన తరువాత ఇన్ఫెక్షన్లను తగ్గించటం గురించి మనం ఎంతో స్పృహతో ఉన్నాం. దీని గురించి మనకు ఎంతో అవగాహన కూడా పెరిగింది. అలాంటి టైంలో ప్రతినిత్యం కొబ్బరి నీళ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంచడంతో పాటుగా ఇన్ఫెక్షన్ మరియు ఎన్నో రకాల వ్యాధులతో సులభంగా పోరాడగలం…