Sun : ఎండలో తిరిగొచ్చి స్నానం చేస్తున్నారా.. చాలా డేంజర్..!

Sun : ఇప్పుడు వేసవి కాలం భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. బయట ఎండలకు జనాలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఎండలు ఈ సారి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. దాంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే ఉండిపోతున్నారు. అయితే ఓ వైపు ఎండలు కొడుతుండటంతో పాటు మరోవైపు ఉక్కపోత కూడా బాగా పెరిగిపోతోందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే చాలా మంది ఎండలో తిరిగి వచ్చి చెమట భరించలేక వచ్చిన వెంటనే స్నానం చేస్తుంటారు. అయితే ఇలా స్నానం చేయడం చాలా డేంజర్ అని అంటున్నారు.

Advertisement

Sun : వెంటనే ఆ పని చేయొద్దు..

ఎందుకంటే బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీటితో స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉందనే చెప్పుకోవాలి. ఈ విషయాన్ని డాక్టర్లే స్వయంగా చెబుతున్నారు. అందుకే ఎండనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీటితో స్నానం చేయొద్దని చెబుతున్నారు డాక్టర్లు.ఇక చాలా మంది బయట తిరగకపోయినా సరే ఎండాకాలం చల్లగా ఉంటుందని చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. అయితే అలా చల్లటి నీటితో స్నానం చేస్తే హార్ట్ ఎటాక్ వచ్చేప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సార్లు బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు…

Advertisement
Sun : ఎండలో తిరిగొచ్చి స్నానం చేస్తున్నారా.. చాలా డేంజర్..!
Sun : ఎండలో తిరిగొచ్చి స్నానం చేస్తున్నారా.. చాలా డేంజర్..!

ఇక బయట నుంచి వచ్చిన వెంటనే కూడా స్నానం చేయొద్దంట. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వెంటనే మన బాడీలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో స్నానం చేస్తే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు.ఎండ నుంచి వచ్చిన వెంటనే కూడా చల్లటి నీటితో స్నానం చేయొద్దు. ఒక అరగంట అయిన తర్వాత స్నానం చేయాలి. అంతే కాకుండా చల్లటి నీళ్లు కూడా ఎండలో తిరిగి వచ్చిన వెంటనే తాగొద్దు. ఎందుకంటే అలా తాగితే రక్తనాళాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఎండ నుంచి వచ్చిన వెంటనే తాగకుండా కాసేపు అయిన తర్వాత తాగాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday