AC and Smoking : ఏసీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నారా…. అయితే ఈ అనర్ధాలు తప్పవు…!

AC and Smoking : వేసవిలో ఎండ అనేది రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. ఈ అధిక వేడి కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే అధిక వేడి కారణం వలన ఏసీలో కూడా మంటలు చెరరేగుతున్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఏసీ అనేది ఏదైనా వేడిని చల్లగా మార్చగలదు. కానీ ఇప్పటికే వేడి అనేది మానవ జీవితానికి ముప్పుగా మారుతుంది. దీనికి తోడుగా ఉపసమనం కోసం చల్లటి గాలి ఇచ్చే ఏసీలు కూడా మారటం కొత్త సమస్యగా మారింది. పరిశోధకుల వివరాల ప్రకారం చూస్తే. ప్రతి రెండు గంటలకు ఐదు,ఏడు నిమిషాల పాటు ఏసీ ను స్విచ్ ఆఫ్ చేయాలి. దాని తర్వాత ఏసీ కి కొంత సౌలభ్యం లభించాలి. అప్పుడే వేడి అనేది తగ్గుముఖం పడుతుంది. కానీ ఆ వేడికి చాలా మంది ఏసీ గదిలోనే సిగరెట్ కూడా తాగుతూ ఉంటారు. దీని వలన కూడా ప్రమాదం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ఏసీలో సిగరెట్లు తాగకూడదు అని అంటున్నారు.

Advertisement
AC and Smoking : ఏసీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నారా.... అయితే ఈ అనర్ధాలు తప్పవు...!
AC and Smoking : ఏసీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నారా…. అయితే ఈ అనర్ధాలు తప్పవు…!

వేసవిలో ధూమపానం మరియు శీతలికరణం ప్రక్రియను కూడా దెబ్బతీస్తుంది. ఇది శరీర వేడిని విడుదల చేయలేదు. ఇది గుండె మరియు మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను కూడా ప్రభావితం చేయగలదు. అందువలన పొగలు కూడా గదిలోనే ఉండిపోతాయి. దీని వలన ఏసీలో ఉండే వారికి కూడా చాలా ప్రమాదం అని ని పునులు తెలిపారు. హీట్ స్ట్రోక్ లేక హీట్ ఇంజురీ ప్రాణాంతకం కావచ్చు. అయితే వేసవిలో సిగరెట్ తాగటం వలన కలిగే నష్టం చాలా రెట్లు పెరుగుతుంది. ధూమపానం చేయని వారికి అనగా పాసివ్ స్మోకర్లు కూడా ప్రమాదం అనేది రెట్టింపు అవుతుంది. ప్రతి సంవత్సరం ఒక మిలియన్ మంది ప్రజలు సిగరెట్ తాగకపోయినా, సెకండ్ హ్యాండ్ స్మోక్ వలన ఎంతో మంది చనిపోతున్నారు…

Advertisement

ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లేక పాసివ్ స్మోకింగ్ కారణం వలన ప్రతి ఏడాదిలో దాదాపుగా 10 లక్షల మంది పైగా చనిపోతున్నారు అని నివేదికలో తేలింది. ఇది ఎంత ప్రమాదం అంటే ప్రపంచ వ్యాప్తంగా 25 శాతం వరకు క్యాన్సర్ మరణాలు సిగరెట్ తాగటం వలన వస్తున్నాయి. సమస్య ఏమిటి అంటే. ప్రజలు ఇంతకాలం తర్వాత కూడా ఈ అలవాటును మాత్రం మానటానికి ఇష్టపడటం లేదు…

Author