Chicken Liver : మీరు మాంసాహారులు అయినట్లయితే కచ్చితంగా చికెను ఎంతో ఇష్టపడతారు. సహజంగానే ఇది రుచితో పాటుగా ఆరోగ్యం నికి కూడా మంచిది. వివిధ మాంసంతో పోల్చినట్లయితే చికెన్ అనేది తొందరగా జీర్ణం కావడం తేలికగ జరుగుతుంది. ఇది ప్రోటీన్ కు మంచి మూలం అని చెప్పొచ్చు. చికెన్ తో వంటకాలు ఎన్నో రకాలుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ప్రతి పద్ధతి కూడా ఎంతో అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే చికెన్ కంటే కూడా చికెన్ లివర్లు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే నోట్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది చికెన్ లివర్స్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. చాలా మంది చికెన్ లివర్లు మరింతగా ఇష్టపడుతూ తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకు అంటే. చికెన్ లివర్ లో విటమిన్ A,B ప్రోటీన్లు, మినరల్స్, ఐరన్,విటమిన్ B 12 కాల్షియం లాంటి పోషకాలు ఎన్నో సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో సెలీనీయం మంచి మొత్తంలో కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. చికెన్ లివర్ తో కంటి మరియు చర్మ, రక్తహీనత సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు.
చికెన్ లివర్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఐరన్, విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది తినటం వలన రక్త కణాలు కూడా పెరుగుతాయి. రక్తహీనత నియంత్రించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చికెన్ లివర్ లో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. మీ డైట్ లో చికెన్ లివర్ను తీసుకున్నట్లయితే బోను ఎముకల వ్యాధి ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మెరుగుపరుస్తుంది…
చికెన్ లివర్ లో విటమిన్ B 12 ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు అంతగానో తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తి మరియు నిరాశ, అయోమయం,చిరాకు లాంటి మానసిక సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా ఇది మంచి ఆహారం అని చెప్పొచ్చు. చికెన్ లివర్ డయాబెటిస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. దీనిని తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్A కంటి చూపుకు చాలా మంచిది. అంతేకాక దీనిలో ఉండే సెలీనియం గుండె సమస్యలపై కూడా ఎంతగానో పోరాడుతుంది. శరీరంలో కొలెస్ట్రా ల్ స్థాయిలను కూడా కంట్రోల్ చేయగలదు. లివర్ లో ఉండేటటువంటి ఫొలేట్ లైంగిక సామర్థ్యాలను కూడా ఎంతగానో పెంచుతుంది. ముఖ్యంగా కండరాలు మరియు ఎముకలకు ఎంతో బలంగా కూడా పనిచేస్తుంది…