Puri Jagannadh : గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ పాటే. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. ఇంతకీ అదేం పాట అంటారా? డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని హీరోగా వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్. ఈ సినిమా నుంచి మార్ ముంతా చోడ్ చింతా అనే పాట యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సాంగ్ గురించి తాజాగా పూరీ జగన్నాథ్ స్పందించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో వచ్చిన దిమాక్ ఖరాబ్ సాంగ్ ను మించి ఈ సినిమాలో ఇంకో సాంగ్ ఉండాలని మూవీ యూనిట్ భావించారట. కానీ.. దిమాక్ ఖరాబ్ లాంటి పాటను మించి ఉండాలంటే.. ఏదో ఒక తెలంగాణ పదం ఉండాలని భావించారట. అందులో భాగంగానే అదే సినిమాలో ఉన్న మార్ ముంతా చోడ్ చింతా అనే డైలాగ్ నే లీడ్ గా తీసుకొని ఈ పాటను డెవలప్ చేసినట్టు పూరీ చెప్పుకొచ్చారు.
ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. ఇక.. ఈ పాటలో హీరోయిన్ కావ్యా థాపర్, హీరో రామ్ ఇద్దరూ తమ డ్యాన్స్ తో అదరగొట్టేశారు. ఇక.. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.