Bunny Vas : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ గురించి చర్చ. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు పెరిగాయని చర్చ జరుగుతోంది. అసలు ఈ రెండు ఫ్యామిలీల మద్య ఇష్యూ ఏంటి? అనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు కానీ.. ఎప్పుడైతే ఏపీ ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ అభ్యర్థిని కలిశాడో అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యామిలీ మద్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి.
ఓవైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కట్టి వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకొని మరీ ప్రచారం చేస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి సపోర్ట్ తో హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం ఏంటి అంటూ మెగా అభిమానులు చర్చకు తెరలేపారు. అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. అల్లు అర్జున్ మద్దతు ఇచ్చిన ఆ వైసీపీ అభ్యర్థి ఓడిపోయాడు. వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోయింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కానీ.. ఈ రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి అని అంటున్నారు.
ఈ రెండు ఫ్యామిలీల మధ్య అసలు ఇష్యూ ఏంటి అని ఆయ్ మూవీ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసుకు ఎదురైంది. దీంతో వాళ్ల ఇష్యూపై స్పందించిన బన్నీ వాసు.. నేను మెగా, అల్లు ఫ్యామిలీని గత 20 ఏళ్ల నుంచి చూస్తున్నా. చిరంజీవి కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి. ప్రతి సంక్రాంతికి వాళ్లంతా కలిసి బెంగళూరు వెళ్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ ఇంట్లో అయినా ఇష్యూస్ రావడం సహజం. అంత మాత్రాన వాళ్ల మధ్య ఉన్న బంధం దెబ్బతిన్నట్టు కాదు. వీటిని హైలెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని బన్నీ వాసు తెలిపారు.