Yagam : ఈ యాగాలు చేయడం ద్వారా కోటేశ్వర్లు అవ్వడం పక్క… అంతటి విశిష్టత ఉన్న యాగం…!

Yagam : అసలు హోమాలు యజ్ఞాలు ఎందుకు చేయాలి…? ఇవి అన్ని రకాలు ఉంటాయి..? వీటి ద్వారా వచ్చే ఫలితాలు ఏమిటి…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హోమం విధానము యజ్ఞము హోమము యాగము. అశ్వమేధ యాగం శ్రీరాముడు చేశాడు. ఇది 27 రోజులు పడుతుంది. యజ్ఞం 15 రోజుల సమయం పడుతుంది. హోమం అయితే ఒక రోజులో అయిపోతుంది. ప్రతి హోమానికి దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఎండుమిరపకాయలతో హోమం చేస్తారు అయితే ఆ హోమం ఎందుకు చేస్తారు అంటే దీనిని ప్రత్యంగిరా హోమం అంటారు. ఎండుమిరపకాయలతో యాగం ద్వారా మనలో ఉన్న దృష్టి దోషములు పోవడం కోసం దీనిని చేస్తారు. అలాగే యజ్ఞల వలన మాత్రమే వర్షం కురుస్తుంది. వర్షం వల్ల మాత్రమే అన్నం సంభవిస్తుంది.

Yagam : ఈ యాగాలు చేయడం ద్వారా కోటేశ్వర్లు అవ్వడం పక్క... అంతటి విశిష్టత ఉన్న యాగం...!
Yagam : ఈ యాగాలు చేయడం ద్వారా కోటేశ్వర్లు అవ్వడం పక్క… అంతటి విశిష్టత ఉన్న యాగం…!

ఆ యజ్ఞం కర్మఫలం బట్టి జరుగుతుంది. అదేవిధంగా అనేక రకమైన హోమాలు ఉన్నాయి. చండీ శ్యామల యాగం ఎవరు పడితే వారు ఎక్కడ పడితే వారు ఎలా పడితే అలా చేయకూడదు.18 మంది గణపాటీలు ఉండాలి. ఈ యాగం వలన మనిషికి రాజ్యఅధికారం వస్తుంది. ఈ యాగం చాలా గొప్పది. దీనిని అందరూ చేయలేరు. అయితే ఏ హోమం చేసిన భార్య పక్కన ఉండాలి. ఏ గుడికి వెళ్లిన ఏ క్షేత్రానికి వెళ్లిన భార్య పక్కనే ఉండాలి. భార్య లేకుండా ఏ హోమము నిర్వర్తించరాదు. ఒకవేళ భార్య లేకపోయినట్లయితే భార్య చీర లేదా వస్త్రాలు భుజం మీద వేసుకొని హోమం చేయాలి. అలాగే ప్రతి హోమానికి ఒక విశిష్టత ఉంటుంది. వివాహం జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక హోమగుండని ఏర్పాటు చేస్తారు. హోమం చుట్టూ ఏడడుగులు వేసిన తర్వాతే మంగళసూత్రం కడతారు.

గాయత్రి హోమం గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత 24 ఉపజేయ మంత్రాలు ఉంటాయి. వాటిని చదవడం అయిపోయిన తర్వాత హోమంలో పట్టుచీర కొన్ని వస్తువులు హోమంలో వెయ్యాలి. లేదా అమ్మవారికి మొక్కుకుంటే అమ్మవారికి ఇచ్చి ఆరాధన చేస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన హోమం యొక్క విధానాన్ని ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేయకూడదు. అయితే పూర్వకాలంలో హోమం చేసేటప్పుడు రాజుగారు అలాగే చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు పురోహితులు అలాగే పండితుల సిద్ధాంతుల సమక్షంలో కూర్చోబెట్టి వివిధ రకాల వంటలు అలాగే కొన్ని కొన్ని హోమాలలో మాంసాన్ని కూడా నివేదన చేస్తారు. సక్రమమైన పద్ధతిలో నియమనిష్టల తోటి భక్తిశ్రద్ధల తోటి హోమం చేసిన వేదాంతల యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు.

Author