Numerology : ఈ తేదీలలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువట… మహార్జాతకులు…!

Numerology :  అంటే ఎవరు..? వీరి యొక్క జీవితం ఎలా ఉంటుంది..? అలాగే వీరి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7వ నెంబర్ లో పుట్టిన వారు అంటే ఏ నెలలో అయినా సరే 7 ,16, 25వ తేదీలో పుట్టిన వారు 7వ నెంబర్ జాతకులు అవుతారు. కేతువు యొక్క జాతకం ప్రకారం కేతువు యొక్క కారకత్వంతో పుట్టిన వారు 7వ నెంబర్ జాతకులు. కేతువు జ్ఞాన ప్రదాత కాబట్టి ఈ నెంబర్ లో పుట్టిన వారు పుట్టుకతోనే మంచి తెలివితేటలతో పుడతారు. కానీ 7వ నెంబర్ లో పుట్టిన వారు ఎదిగే కొద్ది వారి తెలివితేటలే వారిని ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అన్నీ తెలుసు కానీ ఏదో ఒక అనుమానం. ఇది నిజమా కాదా ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటారు. వీరికున్న మేధావి తెలివితేటల తో జీవితంలో ఎదగడానికి అడుగడుగునా అనుమాన పడుతూ ఉంటారు. కావున వారి తెలివితేటలే వారికి మైనస్ గా మారుతాయి.

Numerology : ఈ తేదీలలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువట... మహార్జాతకులు...!
Numerology : ఈ తేదీలలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువట… మహార్జాతకులు…!

అలాగే 7వ నెంబర్ లో పుట్టిన వారికి వారి పేరు రాంగ్ నెంబర్ లోనే వస్తుంది. అందువలన వీరు దేనిమీద ఎక్కువ ఆసక్తిి చూపించరు. ఉన్న ఆదాయం తోటే సరిపెట్టుకునే మనస్తత్వం ఉంటుంది. అలాగే వీరికి డ్రీమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారి పేరు లో రాంగ్ నెంబర్ వస్తుంది. ఒకవేళ వీరి పేరు మంచి నెంబర్ లో గనుక వస్తే అద్భుతమైన మేధా శక్తితో విజయాన్ని సాధించి జీవితంలో నెంబర్ వన్ గా ఎదుగుతారు. కాబట్టి 7వ నెంబర్ లో పుట్టిన వారు పేరులో మంచి నెంబర్ ఉండేలా చూసుకోవాలి. వీరికి జీవితంలో మాంసాహారం అనేది అలవాటు లేకపోతే మంచి వృద్ధి లోకి వస్తారు. 7వ నెంబర్ లో పుట్టిన వారు ముఖ్యంగా గుడ్డు చికెన్ వంటివి పూర్తిగా మానేస్తే వీరికి అనేక రకాల జాతకరీత్యా సమస్యలు తొలుగుతాయి.

Numerology పరిహారాలు

ఈ రాశి వారు జీవితంలో ఎప్పుడు గణపతి ఆరాధనను వదలకూడదు. నిత్యం గణపతిని పూజించాలి. సూర్యోదయానికి ముందే గణపతిని ఆరాధిస్తూ గరికతో పూజ చేస్తూ , బెల్లాని నైవేద్యంగా పెట్టడం ద్వారా అన్ని రకములుగా అనుగ్రహిస్తాడు. వీరికున్న సందేహాలను తీర్చి ముందుకు తీసుకువెళ్లడంలో గణపతి ఆరాధన చాలా ఉపయోగపడుతుంది.

Author