Revanth Reddy – Chandrababu : రేవంత్‌తో చంద్రబాబు భేటీ.. రెండు గంటల పాటు పది అంశాలపై చర్చ

Revanth Reddy – Chandrababu : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి దాదాపు రెండు గంటల పాటు పలు విషయాలపై చర్చించారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఈ భేటీ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవడం ఇదే తొలిసారి. అటు తెలంగాణ, ఇటు ఏపీ.. రెండు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు వచ్చాక తొలిసారి ఈ భేటీ కావడంతో.. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

revanth reddy and Chandrababu meeting at praja bhavan Hyderabad

Advertisement

ఇద్దరు ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా 10 అంశాలపై చంద్రబాబు, రేవంత్ చర్చించారు. 2014 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత పలు అంశాలు అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు జరగలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాలు అలాగే ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వాటి గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు.

Revanth Reddy – Chandrababu : ఉద్యోగుల విభజన, ఇతర అంశాలపై చర్చ

ఏపీ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఆస్తుల పంపకాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. అలాగే.. విభజన చట్టంలో పలు సంస్థల ఆస్తుల పంపకాలను పేర్కొనలేదు. వాటి గురించి కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. పెండింగ్ లో ఉన్న కరెంట్ బిల్లులు, ఉద్యోగుల విభజన, లేబర్ సెస్, ఏపీకి హైదరాబాద్ లో కేటాయించే పలు భవనాలు, ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టుల అప్పులు లాంటి అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు.

Author