KTR vs Revanth : కాంగ్రెసోళ్లు వచ్చి పెద్ద మార్పే తెచ్చారు.. ట్విట్టర్‌లో రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు

KTR vs Revanth : మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అన్నారు. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చిర్రు.. పెద్ద మార్పే తెచ్చిర్రు.. అంటూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి ఏంటో అందరికీ తెలుసు. పురుగుల అన్నం.. నీళ్ల చారు. ఈనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి.. బల్లిపడిన టిఫిన్లు.. చిట్టెలుకలు తిరిగే చట్నీలు.. మొన్న భువనగిరి సాంఘీక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతం.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

ktr slams on revanth reddy govt on twitter

Advertisement

సుల్తాన్ పూర్ లో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్ లోని మెస్ లో చట్నీలో ఎలుక పడటం, అది ఆ చట్నీలో అటు ఇటూ తిరుగుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఇదొక్కటే కాదు.. చాలా ఘటనలు జరిగాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. కోమటిపల్లి హాస్టల్ లో ఉప్మాలో బల్లి పడి.. 20 మంది విద్యార్థులకు వాంతులు అయ్యాయన్నారు.

KTR vs Revanth : చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలు

సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్ లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తారని.. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ? కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లనే ఇదంతా? విద్యార్థులకు ఈ అవస్థ.. ఈ అస్వస్థత అవసరమా? ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి. లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం.. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం అంటూ ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

Author