Chandrababu – Revanth Reddy : ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి గురువు లాంటి వారు. చంద్రబాబు నాయకత్వంలో చాలా సంవత్సరాల పాటు టీడీపీలో రేవంత్ రెడ్డి పని చేశారు. కానీ.. తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు.
కట్ చేస్తే.. ఏపీలో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పేరు రెండు రాష్ట్రాలు వేరు అయినప్పటికీ.. రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. గత పదేళ్ల నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించిన చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు. దీంతో కొత్తగా సీఎంగా చార్జ్ తీసుకున్న చంద్రబాబు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
Chandrababu – Revanth Reddy : రేవంత్ కు కంగ్రాట్స్ చెప్పిన చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నందుకు రేవంత్ రెడ్డికి చంద్రబాబు కంగ్రాట్స్ చెబుతూ.. నీ డెడికేషన్, కమిట్ మెంట్ తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానని లేఖలో తెలిపిన చంద్రబాబు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా తెలంగాణ, ఏపీ అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి పని చేయాలని సూచించారు.
10 ఏళ్ల నుంచి చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం ఏపీకి చెందాల్సినవి చాలా అలాగే పెండింగ్ లో ఉన్నాయి. అందుకే ఇద్దరం కలిసి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుంటే బెటర్. జులై 6, 2024 న శనివారం మధ్యాహ్నం మీ ఆఫీసులోనే కూర్చొని మాట్లాడుకుందాం అని చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మరి.. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.