Telangana Engineering Counselling : ఈరోజు నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈనెల 6వ తేదీ నుంచి 13 తేదీ వరకు తొలి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. ఈనెల 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 19 వ తేదీన ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. ఈనెల 26న రెండో విడత కౌన్సెలింగ్, ఈనెల 31న సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మొత్తం మూడు విడతల్లో రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బీటెక్, బీఈ కోర్సుల కోసం ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది.
నిజానికి.. జూన్ 27 నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది కానీ.. కౌన్సెలింగ్ ప్రక్రియను జులై 4 కి వాయిదా వేశారు. మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక.. ఆగస్టు 13న మూడో విడత సీట్లు కేటాయించి.. ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోటాలో ఇంటర్నల్ స్లైడింగ్ కోసం అధికారులు అవకాశం కల్పిస్తారు.