Pushpa Pushpa Song : పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే…!

Pushpa Pushpa Song : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ Allu Arjun ఇప్పుడు పుష్ప‌2 Pushpa 2 Movie చిత్రంతో బిజీగా ఉన్నాడు. పుష్ప రాజ్ గా తొలి పార్ట‌లో ప్రపంచ సినీ ప్రేమికులు అందరినీ అలరించిన అల్లు అర్జున్.. ఇప్పుడు మ‌రోసారి అదే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. పార్ట్‌ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు మేక‌ర్స్. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఆగ‌స్ట్ 15న మూవీని భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నున్నారు. ఇక గ‌త కొద్ది రోజులుగా మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప గ్లింప్స్, అల్లు అర్జున్ Allu Arjun  పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ అయిన టీజ‌ర్, ర‌ష్మిక Rashmika Mandanna ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ మూవీపై అంచ‌నాలు భారీగా పెంచాయి.

Advertisement
Pushpa Pushpa Song పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే
Pushpa Pushpa Song పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే

Pushpa Pushpa Song ఫ‌స్ట్ సాంగ్‌కి టైం ఫిక్స్..

బాలీవుడ్ బాక్సాఫీసును కూడా దున్నేయడానికి అల్లు అర్జున్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యేర్నేనీ, యలమంచిలి రవి కిశోర్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను ఎనౌన్స్ చేస్తూ.. ఏప్రిల్ 24న సాయంత్రం లిరికల్ సాంగ్‌ ప్రోమోను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. చూస్తుంటే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేటట్లే కనిపిస్తున్నాడు..పుష్ప.. పుష్ప పుష్ప..పుష్ప రాజ్ అంటూ సాగిపోయే పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేయ‌గా, ఇందులో కేవ‌లం బ‌న్నీ చేయి మాత్ర‌మే క‌నిపిస్తుంది.

Advertisement
Pushpa Pushpa Song పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే
Pushpa Pushpa Song పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే

ఫుల్ సాంగ్ మే 1 ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్ర‌కటించారు. ఇక ఈ సాంగ్ నుండి మూవీ ప్రమోష‌న్స్ జోరుగా సాగనున్నాయి. ఇక సినిమాలో పహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్, జగదీప్ ప్రతాప్ బండారీ కీలక పాత్రల్లో కనిపిస్తుండ‌గా, వీరు త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో మ‌రింత అల‌రించ‌బోతున్న‌ట్టు అర్ద‌మ‌వుతుంది. మ‌రి మే 1న విడుద‌ల కానున్న సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday