SS Rajamouli : దటీజ్ రాజమౌళి.. జక్కన్నపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. మోడర్న్ మాస్టర్స్ పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్

SS Rajamouli : ఒక్కడే.. ఒక్కడే.. మంజునాథుడొక్కడే అన్నట్టుగా.. ఒక్కడే.. ఒక్కడే.. రాజమౌళి ఒక్కడే.. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశాడు. బాహుబలి కంటే ముందు తెలుగు సినిమా అంటే తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్లేది కాదు. ఏదో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే డబ్ అయ్యేది. కానీ.. ఇప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పుకోవాలి.

Advertisement

Netflix documentary on ss Rajamouli

Advertisement

ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్.. ఇవి మాస్టర్ పీసులు. ఓటమి ఎరుగని దర్శకుడు ఆయన. ఒక సాధారణ స్థాయి నుంచి ప్రపంచమే మెచ్చే దర్శకుడిగా ఎలా రాజమౌళి తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ఆకాశానికి ఎదిగేలా ఆయన్ను ప్రోత్సహించింది ఏంటి? అనే కాన్సెప్ట్ తో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ రాజమౌళి మీద ఓ డాక్యుమెంటరీ ఫిలింను తీసింది. దానికి సంబంధించిన పోస్టర్ ను తాజాగా నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.

SS Rajamouli : ఆగస్టు 2 న స్ట్రీమింగ్

ఆగస్టు 2న ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మోడర్న్ మాస్టర్స్.. ఎస్ఎస్ రాజమౌళి పేరుతో ఈ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనుంది. ఇక.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా ఏళ్ల సమయం తీసుకున్న జక్కన్న.. ఆర్ఆర్ఆర్ విడుదలై రెండేళ్లు అయినా ఇంకా మహేశ్ తో సినిమాను పట్టాలెక్కించలేదు. ఆ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలోనే ఉంది. చూడాలి మరి.. ఆ సినిమా రిలీజ్ కు ఇంకెన్నేళ్లు వెయిట్ చేయాలో?

Author