Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలకు వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలను పెంచింది టీటీడీ. టీటీడీని కూడా ప్రక్షాళన చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలకు కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా భక్తుల కోసం మరో నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవాణి ట్రస్టు భక్తుల కోసం టికెట్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
శ్రీవాణి ట్రస్టు భక్తుల కోసం ఆదిశేషు విశ్రాంతి భవనంలో ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. దాని కోసం భక్తులు కూడా అందులోనే వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్మినెంట్ గా డీఎఫ్‌వో ఆఫీసులో శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు. దాని కోసం ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నారు.
టీటీడీ ఇటీవలే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సామాన్య భక్తులకు ఇప్పటి వరకు తక్కువ టికెట్లు అందుబాటులో ఉండేవి. ఉదయమే అన్ని దర్శనం టోకెన్లు అయిపోయేవి. అందుకే శ్రీవాణి దర్శనం టికెట్లను రోజుకు వెయ్యికి పరిమితం చేసి ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేస్తోంది. ఆన్ లైన్ లో కేవలం 750 మాత్రమే జారీ చేస్తోంది. వీటికి అదనంగా మరో 250 టికెట్లను టీటీడీ త్వరలో జారీ చేయనుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.